మీరు పిల్లలను నిర్లక్ష్యం చేస్తున్నారా అయితే ఈ టిప్స్ వెంటనే తెలుసుకోండి!

First Published Nov 14, 2021, 3:11 PM IST

ఇప్పుడున్న కంప్యూటర్ యుగంలో వారి ఉద్యోగ పనులలో బిజీగా ఉండటంతో తల్లిదండ్రులకు (Parents) పిల్లలను పట్టించుకునే తీరిక దొరకడం లేదు. దాంతో పిల్లల బంగారు భవిష్యత్తు తప్పుదారిన పడుతోంది. పిల్లలను పట్టించుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. వారు ఎంత బిజీగా ఉన్నా పిల్లల మీద ప్రత్యేక శ్రద్ధ చూపడం అవసరం. పిల్లల బంగారు భవిష్యత్తుకు పునాదులు వేయడం తల్లిదండ్రుల బాధ్యత. ఇప్పుడు ఈ ఆర్టికల్ (Article) ద్వారా తల్లిదండ్రులు పిల్లల్ని నిర్లక్ష్యం చేయడం ద్వారా కలిగే అనర్థాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి  తెలుసుకుందాం..
 

ప్రస్తుతకాలంలో ఉమ్మడి కుటుంబాలు విచ్ఛిన్నమై పోతున్నాయి. దాంతో ఇంట్లో భార్య భర్తలు ఇద్దరు మాత్రమే ఉండటంతో పిల్లల మీద తగిన శ్రద్ధ తీసుకోలేకపోతున్నారు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తే కానీ అవసరాలు తీరని పరిస్థితి. అలాంటప్పుడు ఎదిగి ఎదగని వయస్సులోనే పిల్లలను ఇంటిలోనే వదిలి వెళ్తుంటారు. పిల్లలు ఒక్కరే ఉన్నప్పుడు వారు ఒంటరితనానికి (Loneliness) గురవుతున్నారు. దాంతో వీడియో గేమ్స్ కు (Video games) అలవాటు పడుతున్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు వారు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
 

ఇలాంటి పిల్లలు నలుగురిలో బయటకు తిరగడానికి ఎక్కువగా ఇష్టపడరు. బయట ఆడుకునే ఆటలు తగ్గిపోతున్నాయి. దీంతో శరీరానికి సరైన వ్యాయామం (Exercise) లేక ఊబకాయం (Obesity) బారిన పడుతున్నారు. ఇంటిలోనే ఎక్కువ సమయం గడపడంతో వారికి విటమిన్-డి లోపం ఏర్పడి మానసికంగా ఆందోళన చెందుతున్నారు. అందుకే తల్లిదండ్రులు పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం. తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతారహితంగా ఉంటే వారి భవిష్యత్తు నాశనం అవుతుంది. పిల్లలను మంచి దారిలో వెళుతున్నప్పుడు ప్రోత్సహిస్తూ, వారి చెడు దారిలో వెళ్లకుండా సున్నితంగా మందలించాలి.
 

వారితో వీలు దొరికినప్పుడు ఎక్కువ సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. వారి మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు ప్రయత్నించాలి. తల్లిదండ్రులు ఎప్పుడు పిల్లల ముందర గొడవ పడరాదు. తల్లిదండ్రులు ఇలా గొడవ పడుతుంటే పిల్లలు తమను తాము ఒంటరి వారిగా భావించుకుంటారు. ఇది వారి మానసిక స్థితిపై ప్రభావం చూపుతుంది. పిల్లలు రోజుకు అరగంట కంటే ఎక్కువగా కంప్యూటర్, వీడియో గేమ్స్, ఆన్ లైన్ లో చాట్ చేస్తుంటే గమనించాలి. ఇంటర్నెట్ (Internet), మొబైల్స్ (Mobiles) ను అవసరానికి తగ్గట్టుగా ఉపయోగించుకోవాలని వారికి అవగాహన కల్పించాలి. ఏదీ అతిగా వాడరాదని వారికి తెలియజేయాలి.
 

వీడియో గేమ్స్ ఎక్కువగా ఆడే పిల్లల్లో మానసిక ఒత్తిడి పెరుగుతుంది. దాంతో వారు ఎప్పుడూ చికాకుగా (Irritation) కనిపిస్తారు. ఇది వారి మానసిక ఎదుగుదలను దెబ్బతీస్తుంది. ఇందుకు పిల్లలను వీడియో గేమ్స్ కు దూరంగా ఉంచాలి. లేకపోతే అది వారికి ఒక వ్యసనంగా (Addiction) మారిపోతుంది. దీంతో వారికి అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతున్నాయి. విపరీతమైన కోపం, నిద్రపట్టకపోవడం, డిప్రెషన్‌కి లోనుకావడం వంటి అవలక్షణాలు ఈ ఇంటర్నెట్‌ గేమ్స్‌ ఆడే పిల్లల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే యుక్త వయసు పిల్లలు అశ్లీల వీడియోలను ఎక్కువగా చూడడానికి అట్రాక్ట్ అవుతున్నారు.  దీంతో వారి భవిష్యత్తు దెబ్బతింటుంది. శాస్త్రీయ విజ్ఞానాన్ని మంచి పనుల కోసం ఉపయోగించడం అలవాటు పరచాలి.

click me!