ఈ లక్షణాలుంటే.. మీరు నాయకుడన్నట్టే.. మంచి బాస్ గా క్రెడిట్ మీదే...

First Published | Apr 21, 2022, 11:12 AM IST

ఓ సంస్థ లేదా ఆఫీస్ ఏదైనా సరే సరిగా నడవాలంటే బాస్, ఎంప్లాయిస్ మధ్య సరైన సమన్వయం ఉండాలి. బాస్ అనేవాడు నియంతలా కాకుండా నాయకుడిలా ఉండాలి. అప్పుడే సంస్థ ఎదుగుదల సాధ్యమవుతుంది. అలాంటి నాయకుడి లక్షణాలు మీలో ఉన్నాయా? చూడండి... 

స్ఫష్టమైన అవగాహన
మంచి బాస్ కు కంపెనీకి ఏం కావాలి, దాని లక్ష్యాలేంటి.. ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తుంది.. దానికోసం ఏం చేయాలి అనే అంశాల మీద స్పష్టమైన దృక్కోణం, అవగాహన ఉంటాయి. 

కమ్యూనికేషన్
తన ఉద్యోగుల నుంచి పనిచేయించుకోవడానికి వారితో ఈ అంశాలను సరిగా కమ్యూనికేట్ చేసి.. వారి సహకారంతో లక్ష్యాలను చేరుకోవడానికి ప్రయత్నిస్తారు. 

Latest Videos


పనితీరు
ఉద్యోగుల పనితీరు మెరుగుపడేలా వారిని ప్రోత్సహిస్తారు. వారు కంపెనీకి అనుకూలంగా పనిచేసేలా, మరింతగా తమ సేవలు అందించేలా వారిని వెన్నుతట్టి ప్రోత్సహిస్తాడు. మార్గనిర్దేశనం చేస్తాడు.

ఫీడ్ బ్యాక్
చేస్తున్న మీద ఎప్పుటికప్పుడు ఫీడ్ బ్యాక్ ఇస్తూ.. ఆ పనిలో తప్పొప్పులు సరిచేస్తూ వారి పనితీరు మెరుగుపరుచుకునేలా సహాయం చేస్తారు. దీనికి ఫీడ్ బ్యాక్ బాగా పనిచేస్తుంది. 

నైపుణ్యాలు
మంచి నాయకుడు తన ఉద్యోగుల పనితీరును, వారి శ్రమను, సంస్థకు చేస్తున్న కంట్రిబ్యూషన్ ను ఎప్పటికప్పుడు ప్రశంసిస్తూ వెన్నుతట్టి ప్రోత్సహిస్తాడు.

నిర్ణయాలు
మంచి బాస్ సమయానుకూలంగా నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యాన్ని, అలసత్వాన్ని ప్రదర్శించడు.

అందుబాటులో..
ఉద్యోగులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటాడు. వారికి ఎలాంటి అవసరం వచ్చినా వెంటనే కాంటాక్ట్ చేసేలా ఉంటాడు.

పని పద్ధతి
ఆడుతు, పాడుతు పనిచేస్తుంటే.. అనేది మంచి బాస్ విషయంలో చాలా సరిగ్గా సరిపోతుంది. తన ఎంప్లాయిస్ ను పనిని ఎంజాయ్ చేసేలా చేస్తాడు. పని విషయంలో మోటివేట్ చేసి ఎంకరేజ్ చేస్తాడు. 

ఘనత
మంచి బాస్ ఎప్పుడూ తన ఉద్యోగుల ఘనతను తనదిగా చెప్పుకోడు. అందరిముందు వారి ప్రతిభాపాటవాలను మెచ్చుకుని వారు మరింతగా ఉత్సాహంగా పనిచేసేలా చేస్తాడు. 

click me!