Hair Fall: హెడ్ బాత్ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తే బట్టతల వస్తుంది జాగ్రత్త..

Published : Apr 21, 2022, 09:50 AM IST

Mistakes While Bathing: స్నానం చేసేటప్పుడు తెలిసో తెలియకో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. దీనివల్ల జుట్టు దెబ్బతింటుంది. అంతేకాదు జుట్టు విపరీతంగా రాలడం మొదలయ్యి ఆఖరికి బట్టతలకు దారితీయొచ్చు. 

PREV
18
Hair Fall: హెడ్ బాత్ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ చేస్తే బట్టతల వస్తుంది జాగ్రత్త..

Mistakes While Bathing: ప్రస్తుత కాలంలో హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడేవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఈ హెయిర్ ఫాల్ సమస్యకు ఎన్నో కారణాలున్నాయి. అందులో తలస్నానం చేసేటప్పుడు మిస్టేక్స్ చేయడం కూడా కావొచ్చు. అలాగే తలపై మురికి పోరుకు పోవడం వల్ల కూడా జుట్టు విపరీతంగా రాలడం, జుట్టు వెంట్రుకలు పగుళ్లు రావడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే జుట్టును క్లీన్ గా ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. 

28

జుట్టును ఎలా కడగాలి.. 

తలస్నానం చేయడానికి 30 నిమిషాల ముందు జుట్టుకు నూనెను అప్లై చేయండి. ఆ తర్వాత జుట్టును బాగా తడపండి. ఆ తర్వాత తలకు షాంపూను అప్లై చేసి కొద్ది సేపు మసాజ్ చేయండి. జుట్టును క్లీన్ గా కడిగి కండీషనర్ ను అప్లై చేసి 2 నిమిషాల తర్వాత తలను శుభ్రంచేయండి. ఆ తర్వాత జుట్టును మంచిగా ఆరనివ్వండి. కానీ హెయిర్ డ్రయ్యర్లను మాత్రం అస్సలు వాడకూడదు.

38

ఈ మిస్టేక్స్ చేయకండి.. తలస్నానం చేసిన వెంటనే  తడి జుట్టును దువ్వడం పూర్తిగా మానుకోవాలి. ఎందుకంటే ఆ సమయంలో జుట్టు కుదుల్లు  బలహీనంగా ఉంటాయి. ఆ టైం దువ్వితే జుట్టు ఎక్కువగా రాలిపోతుంది. ఇలాగే ఎక్కువ కాలం చేస్తే మీరు అతితొందరలోనే బట్టతల బారిన పడతారు. 
 

48

వారానికి రెండు మూడు స్లార్ కంటే ఎక్కువ టైమ్స్ జుట్టును కడగడం మానుకోవాలి. ఎందుకంటే ప్రతిరోజూ స్నానం చేయడం వల్ల వెంట్రుకలు పగిలిపోయి గరుకుగా మారుతాయి. 

58

తలస్నానం చేసిన వెంటనే జుట్టుకు వెంటనే నూనెను అప్లై చేయకూడదు. అలా చేస్తే జుట్టు బలహీనపడి రాలిపోవడం మొదలవుతుంది.
 

68

హెడ్ బాత్ చేసిన వెంటనే సహజ గాలిలో జుట్టును ఆరబెట్టండి. ఆ తర్వాత చిక్కులు లేకుండా దువ్వుకుని తలకు కొంచెం నూనె ను పెట్టి కొద్ది సేపు మసాజ్ చేయండి. 

78

కండీషనర్ ని ఉపయోగించడానికి సరైన మార్గం.. 

మార్కెట్లలో దొరికే కండీషనర్ కు బదులుగా కలబందను ఉపయోగించండి. జుట్టు ఆరోగ్యంగా ఉండాలంటే కలబందను వారానికి రెండు సార్లు తలకు ఖచ్చితంగా పెట్టాలి. ముఖ్యంగా జుట్టు కడిగిన తర్వాత ఈ కండీషనర్ ను రాయాలి. దీన్ని రెండు మూడు నిమిషాలు అలాగే ఉంచి.. ఆ తర్వాత నీళ్లతో కడిగేయండి. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. కండీషనర్ ను తలకు పూయకూడదు. 
 

88

జుట్టును ఎలా ఆరబెట్టాలి.. చాలా మంది హెయిర్ తొందరగా ఆరాలని హెయిర్ డ్రయ్యర్ లనే వాడుతుంటారు. కానీ వీటిని వాడటం వల్ల జుట్టు బలహీనపడుతుంది. టవల్ తో జుట్టును ఆరబెట్టుకోవడం మానేస్తే మీ జుట్టు విరిగిపోతుంది. అలాగే డ్రైగా కూడా మారుతుంది. అదే సహజ గాలిలో జుట్టును ఆరబెడితే.. ఎంతటి ఒత్తు జుట్టైనా 30 నిమిషాల్లోనే ఆరిపోతుంది. దీనివల్ల మీ జుట్టు విరిగిపోవడం, రాలిపోవడం వంటి సమస్యలే రావు. కాబట్టి తలస్నానం చేసిన తర్వాత తలకు టవల్ చుట్టి.. ఆ తర్వాత సహజ  గాలిలో ఆరనివ్వండి. 
 

click me!

Recommended Stories