Lunar Eclipse 2022: సంపూర్ణ చంద్రగ్రహణాన్ని బ్లడ్ మూన్ గ్రహణం అనికూడా పిలుస్తారు. ఈ గ్రహణం సమయంలో చంద్రుడు ఎరుపురంగులోకి మారుతాడు. కాగా ఈ గ్రహణం అమెరికా, ఐరోపా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, తూర్పు పసిఫిక్, దక్షిణ పసిఫిక్, అంటార్కిటికా నుంచి మాత్రమే కనిపిస్తుంది. అక్కడి వాళ్లు మాత్రమే ఈ గ్రహణాన్ని పూర్తిగా చూడొచ్చు. కానీ మనదేశంలో ఈ గ్రహణాన్ని మాత్రం చూడలేము.