ఒకప్పుడు చాలామంది బట్టలను చేత్తో ఉతికేవారు. అందుకు ఎంతగానో శ్రమ పడాల్సి వచ్చేది. కానీ వాషింగ్ మెషిన్లు వచ్చాక ఆడవారి కష్టం సగం తీరిపోయిందనే చెప్పాలి. శ్రమతో పాటు టైం కూడా సేవ్ అవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో రకరకాల వాషింగ్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. మరి వాటిలో ఏది బెస్ట్ ఎంపికనో ఇక్కడ చూడండి.
ఆడవాళ్లకు ఇంట్లో ఉండే అతి పెద్ద పని బట్టలు ఉతకడం. వాషింగ్ మిషన్ పుణ్యమా అని.. వారికి ఈ పని నుంచి ఉపశమనం దక్కింది. వాషింగ్ మిషన్ వల్ల శ్రమ, సమయం ఆదా అవుతాయి. ప్రస్తుతం మార్కెట్లో టాప్-లోడ్, ఫ్రంట్-లోడ్ వాషింగ్ మెషిన్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో మిషన్ ది ఒక్కో ప్రత్యేకత. ఇంతకీ ఈ రెండింటిలో ఏది బెస్ట్ ఆప్షనో ఇప్పుడు చూద్దాం.
24
టాప్ లోడ్ వాషింగ్ మిషన్
టాప్-లోడ్ పూర్తిగా ఆటోమేటిక్ వాషింగ్ మెషీన్. ఈ మెషిన్లు కాస్త తక్కువ ధరలో లభిస్తాయి. బట్టలను మంచిగా శుభ్రం చేస్తాయి. ఈ వాషింగ్ మిషన్ల కి పైభాగంలో ఓపెనింగ్ ఉంటుంది. తక్కువ నీటిని ఉపయోగిస్తాయి. వాషింగ్ సైకిల్ కూడా వేగంగా ఉంటుంది. మనం నిలబడే ఈ మెషిన్ లో బట్టలు వేయచ్చు. తీయచ్చు. అయితే, వీటికున్న ఒక లోపం ఏమిటంటే కొన్నిసార్లు అవి బట్టలను చింపివేయవచ్చు లేదా ముడతలు పడేలా చేయవచ్చు.
34
ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్
ఫ్రంట్-లోడ్ వాషింగ్ మెషిన్లు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. ఇవి కూడా తక్కువ నీటిని ఉపయోగించి బట్టలను పూర్తిగా శుభ్రం చేస్తాయి. కానీ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్లకు కాస్త ధర ఎక్కువ. మన్నిక కూడా ఎక్కువే. వీటిలో బట్టలు వేయడానికి, తీయడానికి వంగడం లేదా కూర్చోవాల్సి ఉంటుంది.
44
ఏది బెటర్?
ఫ్రంట్-లోడ్ వాషింగ్ మెషిన్.. టాప్-లోడ్ మెషిన్ల కన్నా ప్రభావవంతంగా పనిచేస్తాయి. బట్టలను మంచిగా శుభ్రం చేస్తాయి. ఫ్రంట్-లోడర్లు నీటితో పాటు కరెంటును కూడా ఆదా చేస్తాయి. టాప్ లోడ్ వాషింగ్ మెషీన్‌తో లో వాషింగ్ మధ్యలో డోర్ ఓపెన్ చేసి బట్టలు వేసుకోవచ్చు. ఫ్రంట్ లోడ్ విషయంలో ఇది సాధ్యం కాదు. అందులో ఒక్కసారి బట్టలు వేసి లాక్ చేస్తే.. మొత్తం బట్టలు ఉతికిన తర్వాతే మెషిన్ డోర్ ఓపెన్ అవుతుంది. వాషింగ్ మెషిన్ కొనాలనుకునేవారు బడ్జెట్ గురించి ఆలోచిస్తే టాప్-లోడ్ వాషర్లు మంచి ఎంపిక. ధర గురించి పర్లేదు అనుకుంటే ఫ్రంట్ లోడ్ మెషిన్ తీసుకోవచ్చు.