Hair Fall: ఇవి తింటే చాలు.. నల్లని, పొడవైన జుట్టు మీ సొంతం

Published : Feb 07, 2025, 03:21 PM IST

నల్లని, పొడవైన జుట్టు మగువల అందాన్ని రెట్టింపు చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. లాంగ్ హేయిర్ కోసం అమ్మాయిలు చేయని ప్రయత్నాలు ఉండవు. మరి ఈజీగా పొడవైన, ఆరోగ్యకరమైన జుట్టు కావాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.  

PREV
113
Hair Fall: ఇవి తింటే చాలు.. నల్లని, పొడవైన జుట్టు మీ సొంతం

అందమైన, పొడవైన జుట్టుకోసం అమ్మాయిలు చాలా ఆరాటపడుతుంటారు. హేయిర్ గ్రోత్ కోసం రకరకాల టిప్స్ ట్రై చేస్తుంటారు. సాధారణంగా ఆడవారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టే సమస్య జుట్టు రాలడం, తెగడం, బలహీనంగా ఉండటం. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏంటో ఇప్పుడు చూద్దాం.

213
జుట్టు పెరుగుదలకు బయోటిన్

బయోటిన్ ఒక B విటమిన్. ఇది ఆరోగ్యకరమైన జుట్టుకు చాలా అవసరం. బయోటిన్ అధికంగా ఉండే ఆహారాలను తినడం ద్వారా జుట్టు దట్టంగా, ఆరోగ్యంగా ఉంటుంది.

313
గుడ్లు

గుడ్లలో బయోటిన్, ప్రోటీన్లు ఎక్కువ ఇవి జుట్టుకు బలాన్ని ఇవ్వడంతో పాటు పొడువుగా పెరిగేందుకు సహకరిస్తాయి. ఇందుకోసం రోజువారి ఆహారంలో గుడ్లను చేర్చుకోవాలి.

413
బాదం, వాల్ నట్స్

బాదం, వాల్‌నట్స్, పొద్దుతిరుగుడు తదితర గింజల్లో బయోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులను కూడా అందిస్తాయి. ఇవి జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి సహకరిస్తాయి.

513
చిలగడదుంప

చిలగడదుంపలో బయోటిన్, బీటా కెరోటిన్ ఉంటాయి. ఈ రెండు పదార్థాలు జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్టు పొడిబారడాన్ని నివారిస్తాయి. చిలగడదుంపను అన్నంలో లేదా కూరగా వండుకోవచ్చు.

613
పాలకూర

పాలకూరలో బయోటిన్‌తో సహా విటమిన్ A అధికంగా ఉంటుంది. ఇందులో ఇనుము, ఫోలేట్ కూడా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి అవసరం.

713
అవకాడోతో

అవకాడోలో ఆరోగ్యకరమైన కొవ్వులు, బయోటిన్ ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు కుదుళ్లను బలపరుస్తాయి.

813
పాల ఉత్పత్తులు

పాలు, జున్ను,పెరుగు లాంటి పాల ఉత్పత్తులు కాల్షియంతో పాటు బయోటిన్‌ను అందిస్తాయి. ఈ పోషకాలు జుట్టుకు సంపూర్ణ పోషణను అందిస్తాయి. వాటిని రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే అద్భుతమైన ఫలితాలను చూస్తారు.

913
తృణధాన్యాలు

ఓట్స్, బార్లీ లాంటి తృణధాన్యాలు బయోటిన్ కు మంచి మూలాలు. వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల జుట్టు పెరుగుదలకు అవసరమైన బయోటిన్ లభిస్తుంది.

1013
ఉసిరికాయ

ఉసిరికాయను విటమిన్ C పవర్‌హౌస్ అంటారు. ఇది జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది.పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. క్రమం తప్పకుండా తీసుకుంటే తెల్లజుట్టు, చుండ్రును నివారించవచ్చు.

1113
కరివేపాకు

కరివేపాకులో బీటా కెరోటిన్, ప్రోటీన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టు రాలడాన్ని తగ్గించి, పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. ఈ ఆకులలో జుట్టు కుదుళ్లను బలపరిచే అమైనో ఆమ్లాలు ఉంటాయి.

1213
మెంతులు

మెంతులు జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయపడతాయి. ఇవి జుట్టు పోషణతో పాటు కుదుళ్లను బలపరుస్తాయి. మెంతులను రాత్రంతా నానబెట్టి, పేస్ట్‌గా చేసి తలకు రాసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి.

1313
అవిసె గింజలు

అవిసె గింజలు ఒమేగా-3 అధికంగా ఉండే సూపర్‌ ఫుడ్. ఇవి జుట్టు పొడిబారడం, విరిగిపోవడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. జుట్టు బలంగా ఉండేలా చూస్తాయి.

click me!

Recommended Stories