ప్రపంచంలో IQ లెవల్స్ చాలా తక్కువ ఉన్న దేశాలివి: ఇండియా ఏ స్థానంలో ఉందో తెలుసా?

Published : Jan 17, 2025, 01:08 PM IST

ఎవరికైతే ప్రపంచ విషయాలపై ఎక్కువ అవగాహన ఉంటుందో, ఎవరైతే తెలివిగా ఆలోచిస్తారో వారికి IQ ఎక్కువ అని అంటుంటారు. మరి 800 కోట్ల జనాభా ఉన్న ఈ ప్రపంచంలో ఏ దేశాల్లో IQ తక్కువ ఉన్న ప్రజలు జీవిస్తున్నారో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఇండియా ఆ లిస్టులో ఉందా? ఉంటే ఏ స్థానంలో ఉందో తెలుసుకుందాం రండి.    

PREV
15
ప్రపంచంలో IQ లెవల్స్ చాలా తక్కువ ఉన్న దేశాలివి: ఇండియా ఏ స్థానంలో ఉందో తెలుసా?

ప్రపంచంలో IQ స్థాయిలు తక్కువగా ఉన్న ప్రజలు నివసించే దేశాల జాబితాను ఎలా తయారుచేస్తారో తెలుసా? సదరు సర్వే సంస్థలు వివిధ అధ్యయనాలు చేస్తాయి. నివేదికలు తయారు చేస్తాయి. వాటి ఆధారంగా ఆ దేశాల లిస్టు రూపొందిస్తాయి. IQ స్థాయిలు తక్కువగా ఉన్న దేశాల్లో సాధారణంగా సామాజిక, ఆర్థిక పరిస్థితులు సరిగా ఉండవు. జనాభా  ఆరోగ్యం, విద్యకు సంబంధించిన అంశాలు తక్కువ స్థాయిలో ఉంటాయి. 2024 ప్రపంచ జనాభా సమీక్ష ఆధారంగా సగటు IQ తక్కువగా ఉన్న కొన్ని దేశాలు ఇక్కడ ఉన్నాయి. 

25
నేపాల్

1. నేపాల్ 
పేదరికం ఎక్కువగా ఉన్న దేశాల్లో నేపాల్ ఒకటి. సదుపాయాలు తక్కువగా ఉండటంతో ఈ దేశంలో నాణ్యమైన విద్య తక్కువగా దొరుకుతుంది. అందువల్ల ఈ దేశంలోని ప్రజల IQ స్థాయి తక్కువగా ఉంటుంది. 

ఈ దేశ ప్రజల సగటు IQ:42.99

2. లైబీరియా
ఈ దేశంలో కొన్ని దశాబ్దాలుగా అంతర్యుద్ధం జరుగుతోంది. ఆ దేశ ప్రజల్లో వర్గాల మధ్య పోరు కారణంగా విద్యా వ్యవస్థను మెరుగుపరచుకోవాలన్న ఆలోచన వారిలో కలగడం లేదు. ఎప్పటికప్పుడు దేశంలో అంతర్గత గొడవలను సరిచేసుకోవడంతోనే కాలం గడిచిపోతోంది. విద్యావ్యవస్థ సరిగా లేకపోవడంతో ఆ దేశ ప్రజల IQ స్థాయి కూడా తక్కువగా ఉంది. 

ఈ దేశ ప్రజల సగటు IQ:45.07
 

35
సియేర్రా లియోన్

3. సియేర్రా లియోన్
ఈ దేశంలో పేదరికం ఎక్కువ. ఎందుకంటే ఈ దేశంలో ఎబోలా వంటి ఆరోగ్య ఎమెర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో దేశ నిధులన్నీ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికే ఖర్చుపెట్టే పరిస్థితి ఉంది. దీంతో విద్యకు ప్రాధాన్యం తక్కువగా ఇస్తారు. అందుకే ఈ దేశ ప్రజల IQ స్థాయి కూడా దేశ ఆర్థిక పరిస్థితులకు తగ్గట్టుగా తక్కువగా ఉంటుంది. 

ఈ దేశ ప్రజల సగటు IQ:45.07

4. గ్వాటెమాల
పోషకాల లోపం ఈ దేశ ప్రజలను పట్టి పీడిస్తోంది. దీంతో ఆరోగ్యాలు దెబ్బతినడంతో ఆ దేశ ప్రజలు సరైన ఆహారం సంపాదించేందుకే ఎక్కువ ప్రాధాన్యమిస్తారు. అందుకే ఈ దేశంలో పేదరికం పెరిగిపోతోంది. పేదరికం వల్ల విద్యకు కూడా ప్రాధాన్యం తక్కువే. ప్రాధమిక విద్య కూడా సక్రమంగా అందని ఈ దేశంలో ప్రజల IQ స్థాయిలు అదే విధంగా ఉంటాయి. 

ఈ దేశ ప్రజల సగటు IQ:47.72
 

45
గాంబియా

5. గాంబియా
ఈ దేశం పేదరికంలో మగ్గుతోంది. ఆదాయ మార్గాలు తక్కువగా ఉండటంతో నిధుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో దేశంలో పేదరికం పెరిగిపోతోంది. దీనికి తోడు పోషకాహార లోపం కారణంగా ప్రజలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందువల్ల విద్యా వ్యవస్థలో పెద్దగా పురోగతి లేదు. 

ఈ దేశ ప్రజల సగటు IQ:52.98

6. నికరాగ్వా
నికరాగ్వా దేశం ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. అందువల్లే ఆ దేశంలో పాఠశాలలకు వెళ్లే పిల్లలు తక్కువ. ఇక్కడ నాణ్యమైన విద్య దొరకడం కష్టంగా మారింది. ఈ దేశంలో పెద్దలతో సహా, పిల్లలకు కూడా పనికి వెళితేనే కడుపు నిండా తినే పరిస్థితి ఉంది. అందుకే ఈ దేశ ప్రజల IQ తక్కువగా ఉంటుంది.

ఈ దేశ ప్రజల సగటు IQ:52.69

55
గినియా

7. గినియా
ఈ దేశంలో పేదరికం, పోషకాహార లోపం విద్యా విధానంపై ప్రభావం చూపుతున్నాయి. ఇక్కడ చదువు కంటే ఆహారం సంపాదించడానికే ప్రజలంతా ప్రాధాన్యం ఇస్తారు. దేశ నాయకులు కూడా ప్రజల ఆరోగ్యం, ఆర్థిక పురోగతిపైనే చర్యలు తీసుకుంటున్నారు. శారీరకంగా కష్టపడటానికే తప్ప మేధాశక్తిని పెంపొందించుకోనే పరిస్థితి ఈ దేశంలో చాలా తక్కువ.

ఈ దేశ ప్రజల సగటు IQ:53.48

ఆర్థికంగా పురోగతి సాధిస్తున్న దేశంగా ఇండియా కొనసాగుతుండటంతో ఇక్కడ ప్రజల IQ బాగానే ఉంది. టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న ఇండియా అత్యల్ప IQ స్థాయి జాబితాలో లేదు.  

click me!

Recommended Stories