శక్తి
అన్నంలో మాదిరిగా మరమరాల్లో కూడా కార్భోహైడ్రేట్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి మన శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తాయి. వీటిని తింటే మనం రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటాం. అలసట నుంచి ఉపశమనం కూడా కలుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
డయాబెటీస్ ఉన్నవారికి మంచివి
మరమరాలు డయాబెటీస్ ఉన్నవారికి కూడా మంచి ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే వీటిలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తప్రవాహంలో చక్కెర విడుదలను నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది. వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు వెంటనే పెరగవు. అందుకే డయాబెటీస్ ఉన్నవారు ఇవి తినాలంటారు.