పూణే..
ముంబైకి దగ్గరలోనే ఉన్నప్పటికీ, ముంబై ఉరుకుల పరుగుల జీవితానికి, కాలుష్యానికి పూర్తి భిన్నంగా ఉండే నగరం పూణే. ఇక్కడ పచ్చదనం చాలా ఎక్కువగా ఉంటుంది, పరిశ్రమలు కాస్త తక్కువగా ఉంటాయి కాబట్టి... కాలుష్యం కూడా తక్కువగా ఉంటుంది. 'ఆక్స్‌ఫర్డ్ ఆఫ్ ది ఈస్ట్' అని కూడా పూణే నగరాన్ని పిలుస్తారు. ఇక్కడ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు ఉన్నాయి. ముంబైకి సమీపంలో ఉండటం వల్ల ఐటీ, ఇతర కంపెనీలకు, ఉద్యోగులకు ఇది అత్యంత ఇష్టమైన నివాస ప్రాంతంగా మారింది.
4. గ్వాలియర్
మధ్యప్రదేశ్‌లోని చారిత్రక నగరమైన గ్వాలియర్, తరచుగా కురిసే వర్షాల వల్ల సహజంగానే గాలిని శుభ్రపరుచుకుంటూ ఉంటుంది దీంతో దేశంలోని క్లీన్ సిటీస్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ నగరాన్ని సిటీ ఆఫ్ మ్యూజిక్ గా కూడా గుర్తించారు. శాస్త్రీయ సంగీతానికి ఇది పుట్టినిల్లు కావడం విశేషం.
5.రాయ్ పూర్.
ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్.. ఒకవైపు స్టీల్, పవర్, సిమెంట్ రంగాల్లో భారీ పారిశ్రామిక కేంద్రంగా ఎదుగుతూనే, మరోవైపు కాలుష్యాన్ని అదుపులో ఉంచుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నాన్-మెట్రో హబ్‌లలో రాయ్‌పూర్ ఒకటి. భారీ పరిశ్రమలు ఉన్నప్పటికీ, కాలుష్యం తక్కువగా ఉండటం విశేషం. తక్కువ ఖర్చుతో మంచి జీవితం కొనసాగించాలి అంటే.. ఈ నగరం బెస్ట్ ఆప్షన్.