రెగ్యులర్ గా మనం చాలా రకాల ఫుడ్ ఐటెమ్స్ తింటుంటాం. మన లైఫ్ స్టైల్, ఫైనాన్షియల్ స్టేటస్ కి తగ్గట్టుగా మన ఎంపిక ఉంటుంది. కొందరు నార్మల్ ఫుడ్ తీసుకుంటారు. మరికొందరు కాస్త కాస్ట్లీ ఫుడ్ తీసుకుంటారు. కానీ లక్షల్లో ధర ఉండే ఫుడ్ ఎప్పుడైనా తిన్నరా? ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఫుడ్ గురించి మీకు తెలుసా?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆహార పదార్థాలలో ఒకటి ఈ నల్ల పుచ్చకాయ. ఇది జపాన్‌కు చెందిన ఒక ప్రత్యేకమైన పండు. దీనిని డెన్సుక్ పుచ్చకాయ అని కూడా పిలుస్తారు. వేలంలో దాదాపు నాలుగున్నర లక్షల రూపాయల వరకు వీటి ధర పలుకుతుంది.