టమాటాలు ఎన్నో ప్రయోజనాలున్న కూరగాయ. టమాటాల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి 6, ఫోలేట్, పొటాషియం, మాంగనీస్, మెగ్నీషియం, ఫాస్పరస్, రాగి, ఫైబర్, ప్రోటీన్, లైకోపీన్ పుష్కలంగా ఉంటాయి. దీనిలోని విటమిన్ సి, ఇతర యాంటీ ఆక్సిడెంట్ల మన ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. టమాటాలు ఆరోగ్యానికే కాదు చర్మ ఆరోగ్యానికి మంచి మేలు చేస్తాయి. టమాటాలతో చేసిన ఫేస్ ప్యాక్ చర్మ సంరక్షణకు బాగా సహాయపడుతుంది. టమాటాతో తయారుచేసిన ఫేస్ ప్యాక్స్ ముఖంపై నల్లటి మచ్చలు, ముడతలు వంటి చర్మ సమస్యలను పోగొట్టి ముఖాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది. ఇందుకోసం ఏం చేయాలంటే?