Hair Oil: జుట్టు రాలడం ఆగిపోవాలంటే..ఈ గింజల నూనె తలకు పట్టించండి చాలు

Published : Aug 14, 2026, 01:19 PM IST

Hair Oil: జుట్టు రాలిపోయే సమస్యతో బాధపడుతున్నారా? అయితే ప్రతిరోజూ వాడే నూనె కన్నా కొంచెం భిన్నంగా ప్రత్యేకమైన నూనెను తలకు పట్టించండి. ఆ నూనె మార్కెట్లో సులువుగా దొరుకుతుంది. ఆ నూనె ఏంటో తెలుసుకోండి.

PREV
13
జుట్టు రాలకుండా వాడాల్సిన నూనె

ఇప్పుడు చాలామందికి జుట్టు రాలడం, వెంట్రుకల కుదుళ్లు బలహీనపడటం, జుట్టు నిర్జీవంగా మారడం వంటి సమస్యలు నిత్యం ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యల నుంచి ఎలాగైనా ఉపశమనం పొందాలనే ఆరాటంతో చాలామంది మార్కెట్లో లభించే ఖరీదైన రసాయనాలు కలిపిన హెయిర్ కేర్ ప్రొడక్ట్స్, కాస్మెటిక్ నూనెలు, ఖరీదైన షాంపూలను వాడుతున్నారు. కానీ మన ఇంట్లోనే సులభంగా దొరికే గుమ్మడికాయ గింజలతో తయారుచేసే హెయిర్ ఆయిల్‌ జుట్టు సమస్యలకు అద్భుత పరిష్కారంగా నిపుణులు చెబుతున్నారు. గుమ్మడికాయ గింజల్లో జుట్టు పెరుగుదలకు అవసరమైన యాంటీఆక్సిడెంట్లు, ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్లు, ఐరన్, జింక్, మెగ్నీషియం, కాపర్, ఫైబర్, విటమిన్-ఇ వంటి విలువైన పోషకాలు లభిస్తాయి. ఇవన్నీ జుట్టు మూలాలను బలంగా మార్చి, జుట్టు రాలడాన్ని అరికడతాయి.

23
నూనె ఇలా తయారుచేయండి

గుమ్మడికాయ గింజల నూనెను మన వంటింట్లోనే సులువుగా తయారుచేసుకోవచ్చు. దీని తయారీకి కావలసిన పదార్థాలు కూడా చాలా తక్కువ. కేవలం అర కప్పు గుమ్మడికాయ గింజలు, ఒక కప్పు స్వచ్ఛమైన కొబ్బరి నూనె, ఒక టీస్పూన్ కలోంజి (నల్ల జీలకర్ర) గింజలు ఉంటే సరిపోతుంది. నూనె తయారీ కోసం ముందుగా గుమ్మడికాయ గింజలను నీటితో కడిగి, అందులోని తేమ అంతా పోయేలా ఒక ప్లేట్‌లో పూర్తిగా ఆరబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్‌లో ఈ గింజలను వేసి వేయించాలి. గింజలు చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి కాస్త బరకగా పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాత్రలో కొబ్బరి నూనెను పోసి తక్కువ మంటపై వేడి చేయాలి. నూనె కొద్దిగా వేడెక్కగానే అందులో బరకగా రుబ్బిన గుమ్మడికాయ గింజల పొడి, కలోంజి గింజలను వేయాలి. ఈ మిశ్రమాన్ని గరిటెతో కలుపుతూ 15 నుంచి 20 నిమిషాల పాటు సన్నని మంటపై మరిగించాలి. గింజల్లోని ఔషధ గుణాలు నూనెలోకి దిగిన తర్వాత స్టవ్ ఆపేసి పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తరువాత నూనెను వడకట్టి గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.

33
గుమ్మడి నూనెతో మసాజ్

గుమ్మడికాయ గింజల నూనెను వారానికి రెండు నుంచి మూడు సార్లు వాడటం వల్ల ఉపయోగం ఉంటుంది. తలస్నానం చేయడానికి ముందు కొద్దిగా నూనెను ఒక చిన్న గిన్నెలోకి తీసుకుని గోరువెచ్చగా చేసుకోవాలి. ఆ గోరువెచ్చని నూనెను చేతి వేళ్లతో తల కుదుళ్లకు బాగా పట్టించి 5 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. దీనివల్ల తలలో రక్తప్రసరణ పెరిగి వెంట్రుకల కుదుళ్లకు అవసరమైన పోషణ అందుతుంది. మసాజ్ పూర్తయిన తర్వాత కనీసం ఒక గంట పాటు అలా వదిలేయాలి. తరువాత మైల్డ్ షాంపూతో శుభ్రంగా తలస్నానం చేయాలి. ఇలా కొన్ని నెలల పాటూ చేస్తే జుట్టు రాలడం పూర్తిగా అదుపులోకి వస్తుంది. ఎటువంటి హానికర రసాయనాలు లేని ఈ సహజ నూనెతో జుట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories