పచ్చిపాలలో వీటిని కలిపి ముఖానికి పెడితే ఎన్ని చర్మ సమస్యలు తగ్గిపోతాయో..!

First Published Jun 1, 2023, 11:36 AM IST

ముఖంపై మొటిమలు, మచ్చలు, దద్దుర్లు రాకూడదంటే పచ్చి పాలలో కొన్ని పదార్థాలను కలిపి ముఖానికి రాయాలని నిపుణులు అంటున్నారు. దీన్ని ఎలా తయారుచేయాలంటే? 
 

వాతావరణం మారడంతో చర్మంలో కూడా ఎన్నో మార్పులు వస్తాయి. అయితే ముఖాన్ని అందంగా మార్చడానికి మనం ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్ లను ఉపయోగిస్తుంటాం. కానీ బ్యూటీ ప్రొడక్ట్స్ లో ఉండే కెమికల్స్ కొన్నిసార్లు మన చర్మానికి హాని కలిగిస్తాయి. ఫలితంగా దద్దుర్లు, మొటిమలు, మచ్చలు వంటి ఎన్నో చర్మ సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమస్యలకు పాలు మంచి మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. పాలను వాడటం వల్ల చర్మంపై దురద తగ్గిపోతుంది. చర్మం తేమగా ఉంటుంది. వేసవిలో మన చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి పచ్చిపాలలో ఎలాంటి పదార్థాలను కలపాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

skin care

పాలు, ఓట్స్

బయోటిన్, ప్రోటీన్, లాక్టిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే పాలు ముఖ చర్మాన్ని తేమగా ఉంచడానికి సహాయపడతాయి. ముఖంపై ఉన్న డ్రైనెస్ ను తొలగించడానికి ఒక టీస్పూన్ ఓట్స్ లో 4 టీస్పూన్ల పాలు, తేనె కలపండి. ఇప్పుడు దీన్ని చిక్కటి పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయండి. 2 నుంచి 3 నిమిషాల పాటు మసాజ్ చేయండి. తర్వాత 15 నుంచి 20 నిమిషాల తర్వాత ముఖాన్ని కడుక్కోండి. ఇలా చేయడం వల్ల ముఖంపై పేరుకుపోయిన దుమ్ము, మట్టితో పాటు పొడిబారే సమస్య తొలగిపోతుంది. మృతకణాలు కూడా తొలగిపోతాయి. 
 

skin care


పాలు, ఖర్జూరం, బాదం

విటమిన్ ఎ, విటమిన్ బి6, విటమిన్ డి లు పాలలో పుష్కలంగా ఉంటాయి. ఇది చర్మాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తుంది. నల్ల మచ్చలు కూడా తగ్గిపోతాయి. టానింగ్ ను తొలగించడానికి అర కప్పు పాలలో 3 ఖర్జూరాలు, 3 బాదంలను రాత్రంతా నానబెట్టండి.  లేదా 8 నుంచి 10 గంటలు నానబెట్టి తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత ముఖానికి అప్లై చేయండి. 10 నుంచి 15 నిమిషాల తర్వాత ముఖాన్ని సాధారణ నీటితో కడిగేయండి. ఈ ప్యాక్ ముఖం చర్మ రంగును మెరుగుపరుస్తుంది. ముఖాన్ని కడిగిన తర్వాత రోజ్ వాటర్ తో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి.
 

skin care

పాలు, ముల్తాలీ మట్టి

ఇందులోని ప్రోటీన్, బయోటిన్, విటమిన్ బి12 లక్షణాలు చర్మంపై మొటిమల సమస్యను తొలగిస్తాయి. చర్మ కణాలు, కణజాలాల మరమ్మత్తుకు దీనిలోని ప్రోటీన్ సహాయపడుతుంది. అంతేకాకుండా దీనిలో  ఉండే క్యాల్షియం కూడా చర్మంలో కొల్లాజెన్ ను పెంచడానికి సహాయపడుతుంది. ఇందుకోసం నాలుగు చెంచాల పాలలో ఒక టీస్పూన్ ముల్తానీ మిట్టి కలిపి చిక్కటి పేస్ట్ తయారు చేసుకోవాలి. ఇప్పుడు అందులో కొన్ని చుక్కల రోజ్ వాటర్ ను కలపండి. బ్రష్ సహాయంతో దీన్ని ముఖానికి అప్లై చేయండి. కావాలనుకుంటే మెడకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ముఖంపై మొటిమలు తగ్గిపోతాయి. 
 

skin care


పాలు, తేనె, అరటి

పొటాషియం, క్యాల్షియం ఎక్కువగా ఉండే అరటిపండు, పాలు యాంటీ ఏజింగ్ ఏజెంట్ గా పనిచేస్తాయి. ఇది చర్మాన్ని యవ్వనంగా ఉంచడంతో పాటుగా ముఖంపై కనిపించే సన్నని గీతలను తొలగిస్తుంది. యవ్వన గుణాలున్న పాలు, అరటిపండు పేస్ట్ చర్మానికి ఎన్నో ప్రయోజనాలను అందిస్తాయి. ఇందుకోసం సగం అరటిపండును మెత్తగా రుబ్బి దానికి అవసరమైనంత పాలను కలపండి. మందపాటి ద్రావణాన్ని తయారు చేసిన తర్వాత అందులో తేనె, కొన్ని చుక్కల బాదం నూనె మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. ఇది ముఖంపై ముడతలను తొలగిస్తుంది. అలాగే చర్మం కూడా ఆరోగ్యంగా మారుతుంది. ఇది వేడి ప్రభావాల నుంచి మీ చర్మాన్ని కూడా రక్షిస్తుంది. ఈ పేస్ట్ ను ముఖానికి 10 నుంచి 15 నిమిషాల పాటు అప్లై చేయండి. వారానికి 2 సార్లు అప్లై చేస్తే మీ ముఖం అందంగా మారుతుంది. 
 

పాలు, బొప్పాయి

పాలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల చర్మం యవ్వనంగా, కాంతివంతంగా మారుతుంది. ఇది ముఖంపై చెమటను, దుమ్మును తొలగిస్తుంది. అరకప్పు బొప్పాయి గుజ్జులో 2 టీస్పూన్ల పాలను కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేయండి. 10 నుంచి 15 నిమిషాల పాటు వదిలేయండి. దీనివల్ల చర్మం తేమగా మారుతుంది. అలాగే చర్మం ఆకృతిలో కూడా ఎన్నో మార్పులు కనిపిస్తాయి. చర్మం ఆరోగ్యంగా ఉండటానికి ఈ రెమెడీని వారానికి 2 నుంచి 3 సార్లు  పెట్టండి. 

click me!