Tomato Growing: కుండీలోనే టమోటాలు గుత్తులుగా కాయాలంటే వీటిని మట్టిలో కలపండి

Published : Apr 13, 2026, 01:42 PM IST

Tomato Growing: మీ ఇంటి బాల్కనీలో ఒకే కుండీలో గుత్తులు గుత్తులుగా టమాటాలు కాసేలా చేయవచ్చు. మట్టిలో విత్తనాలు నాటడం, సేంద్రియ ఎరువులు, మొక్కల సంరక్షణ గురించి ఫుల్ గైడ్ ఇచ్చాము. అలాగే మట్టిలో కొన్ని పదార్థాలు కలపాల్సి వస్తుంది.

PREV
14
కుండీలో సులువుగా టమోటా పెంపకం

కుండీలో సులువగా పెంచే కూరగాయల్లో టమోటాలు ఒకటి. ఇందుకోసం మీ బాల్కనీలో ఎండ తగిలే చోటును ఎంపిక చేసుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనది. టమాటా మొక్కలకు ఎండ ఉంటేనే అవి పెరుగుతాయి. సరైన వెలుతురు ఉంటేనే  టమోటా మొక్కలు బాగా పెరిగి ఎక్కువ దిగుబడి వస్తుంది. 

అలాగే  మొక్కలు పెంచే మట్టి నాణ్యత  ప్రధానమైనది. ఎర్రమట్టి, వానపాముల ఎరువు, కోకోపీట్‌లను సమాన నిష్ఫత్తిలో కలిపి మట్టి మిశ్రమాన్ని రెడీ చేసుకోవాలి. టమాటా మొక్కల వేర్లు లోతుగా వెళ్తాయి కాబట్టి, కనీసం 12 అంగుళాల లోతు, వెడల్పు ఉన్న కుండీలు ఎంపిక చేసుకోవడం మంచిది.

24
ఎలా పెంచాలి?

టమోటాలలో ఉన్న చిన్న చిన్న విత్తనాలను సేకరించాలి. వాటిని నేరుగా కుండీలో నాటడం కంటే, ఒక చిన్న ట్రేలో వేసి నారు మొక్కలుగా పెంచాలి. అవి అవి నాలుగు అంగుళాల ఎత్తు పెరిగాక పెద్ద కుండీలోకి మార్చాలి. దీని వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి. నీళ్ల విషయానికొస్తే కుండీలో మట్టి పొడిగా మారినప్పుడు మాత్రమే నీళ్లు పోయాలి.

34
మొక్కలను ఇలా కాపాడుకోంండి

టమోటా మొక్క ఆకులపై నీళ్లు పడకూడదు. నేరుగా మొక్క వేర్ల దగ్గర పోయాలి. ఇలా చేయడం వల్ల ఆకుమచ్చ, బూజు తెగుళ్లు రాకుండా ఉంటాయి. మొక్క పెరగడం మొదలయ్యాక, దాని బరువును మోయడానికి ఒక కర్ర పాతి సపోర్ట్ ఇవ్వాలి. లేదంటే మొక్క కిందకు వంగిపోయి కాయలు కుళ్లిపోతాయి.

44
సేంద్రియ పద్ధతిలో టమాటా సాగు

ఈ మొక్కలను జాగ్రత్తగా కాపాడుకోవాలి.  అనవసరమైన కొమ్మలను ఎప్పటికప్పుడు కత్తిరిస్తూ ఉండాలి. దీనివల్ల కాయలు బాగా కాస్తాయి. 15 రోజులకు ఒకసారి పంచగవ్య, ఫిష్ అమినో యాసిడ్ లేదా వానపాముల ఎరువు వంటి సేంద్రియ ఎరువులు వేయాలి. ఇవి మొక్కకు రోగనిరోధక శక్తిని పెంచి, టమాటాలు అధికంగా వచ్చేలా చేస్తాయి.

ఇలా  పెంచిన మొక్కలు సేంద్రియ పద్ధతిలో పండించిన టమాటాలను అందిస్తాయి.  మార్కెట్లో దొరికే వాటికంటే ఇవి చాలా రుచిగా ఉంటాయి.  సరైన ప్లానింగ్, రోజూ కొద్దిపాటి శ్రద్ధ పెడితే చాలు.. టమోటాలను భారీగా పెంచుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories