పుచ్చకాయ: ఈ పండు ఎండాకాలంలోనే ఎక్కువగా లభిస్తుంది. ఈ పండులో కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉండి నీటి శాతం ఎక్కువ కలిగి ఉంటుంది. ఈ పండులో విటమిన్ ఎ, సి, బి6, లైకోపీన్, ఆమైనో యాసిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.