Holi 2022: హోలీ పండుగ చేసుకోవడం వల్ల మనకు కలిగే లాభాలేంటో తెలుసా..

First Published | Mar 12, 2022, 4:53 PM IST

Holi 2022: ప్రతి పండుగ వెనుక ఖచ్చితంగా సైంటిఫిక్ రీజన్ ఉంటుంది. అలాగే ఈ హోలీ వెనుక కూడా సైంటిఫిక్ రీజన్ ఉంది. హోలీలో పాల్గొనడం వల్ల మనకు ఎన్ని లాభాలు కలుగుతాయో తెలుసా.. 

holi

Holi 2022: హోలీ పండుగ వస్తూ వస్తూనే ఆనందాలను, సంతోషాలను మోసుకొస్తుంది. ఈ పండుగ రోజున ఎలాంటి తారతమ్యాలు లేకుండా జరుపుకుంటారు. అయితే హోలీ కేవలం సరదా, సంతోషాల కోసమే కాదు.. దీని వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయన్న ముచ్చట మీకు ఎరుకేనా.. అవును హోలీ నాడు పాటించే ప్రతి విషయం వల్ల మనకు ఎన్నో లాభాలు జరుగుతాయి. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.

చల్లని పానీయాలు: హోలీ నాడు ఎక్కువగా బాంగ్ తాండాయి, లస్సీ వంటి పానీయాలను ఎక్కువగా తాగుతుంటారు. ఈ పానీయాలల్లో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలుంటాయి. ఈ పానీయాలల్లో ఎక్కువగా పుచ్చకాయ గింజలు, బాదం పప్పులతో పాటుగా ఎన్నో న్యూట్రియన్స్ ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

Latest Videos


సహజమైన రంగులు:  హోలీ నాడు సహజ రంగులనే ఉపయోగించాలి. వీటిని చల్లుకోవడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. గోరింటాకు, మందార పువ్వు, చందనం వంటి వాటితో రంగులను తయారుచేసి జల్లుకోవడం వల్ల మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇవి జుట్టుకు ఆరోగ్యానికి కూడా సహాయపడతాయి. ఈ సహజ రంగులు మన స్కిన్ ను శుభ్రపరుస్తాయి.
 

ముఖ్యంగా ఇవి మన చర్మంపై పడటంతో మృత కణాలు తొలగిపోతాయి. దాంతో స్కిన్ కాంతివంతంగా తయారవుతుంది. కాబట్టి ఈ హోలీకి ఎట్టి పరిస్థితిలో కెమికల్స్ రంగులను వాడకండి. సహజ రంగులను తయారుచేసి వాటితోనే హోలీని సెలబ్రేట్ చేసుకోండి. 
 

holi 2022

హోలీకా దహనం: హోలీని పండుగను పురస్కరించుకుని హోలీకా దహనం చేస్తుండటం సాంప్రదాయంగా వస్తూనే ఉంది. అయితే వసంతం కాలం లో బ్యాక్టీరియా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ బ్యాక్టీరియా వల్ల ఎన్నో జబ్బుల సోకే ప్రమాదం ఉంది. 

అయితే హోలికా దహనం చేసిన ఆ మంట చుట్టూరా తిరిగితే.. రోగాలను పుట్టించే బ్యాక్టీరియా నశిస్తుందట. కాబట్టి ఆ మంటల చుట్టూ తిరగండి. ఇలా మనకి హోలీ వల్ల ప్రయోజనాలు కలుగుతాయన్న మాట

click me!