మొటిమలు తగ్గాలంటే.. ఈ ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే..

First Published Sep 12, 2022, 12:51 PM IST

మొటిమలు కొన్ని రకాల ఆహారాలను తింటే కూడా వస్తాయి. అందుకే మొటిమలకు కారణమయ్యే ఆహారాలకు దూరంగా ఉండాల్సిందే.. 

Acne_problem

మొటిమల సమస్య యూత్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ మొటిమలు ఎన్నో కారణాల వల్ల వస్తాయి. ముఖ్యంగా ఈ మొటిమలు ఆయిలీ ఫుడ్ ను ఎక్కువగా తినేవారిలోనే కన్పిస్తాయంటున్నారు నిపుణులు. మొటిమలు రాకుండా ఉండాలన్నా.. అవి తగ్గిపోవాలన్నా ఆయిలీ ఫుడ్స్ కు దూరంగా ఉండటంతో పాటుగా నీళ్లను ఎక్కువగా తాగాలి. అప్పుడే ముఖంపై మొటిమలు తొందరగా తగ్గిపోతాయి. మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇంతకీ మొటిమలు తగ్గాలంటే ఏయే ఆహారాలకు గుడ్ బాయ్ చెప్పాలో తెలుసుకుందాం పదండి.. 

గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలు

 గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తింటే కూడా మొటిమలు విపరీతంగా అవుతాయి. బంగాళాదుంపలు, వైట్ బ్రెడ్, మైదా పిండితో చేసిన పాస్తా, చక్కెరతో నిండిన ఉత్పత్తులు, సోడా వంటి వాటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇవి మీ రక్తంలో చక్కెరను పెంచడంతో పాటుగా.. చర్మంపై ఎక్కువ నూనెను ఉత్పత్తి చేస్తుంది. దీంతో మొటిమలు ఏర్పడతాయి. అందుకే మొటిమలు ఎక్కువగా ఉండేవారు వాటిని తినకపోవడమే మంచిది.
 

పాల ఉత్పత్తులు

పాలు, ఇతర పాల ఉత్పత్తులు, ఐస్ క్రీమ్ లు వంటి వాటిని తీసుకోవడం వల్ల కూడా మొటిమలు విపరీతంగా పెరిగిపోతాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఆవు పాలు ఐజిఎఫ్-1 అని పిలువబడే ఇన్సులిన్ లాంటి హార్మోన్ ను ప్రోత్సహిస్తుంది. ఇది మొటిమలు ఏర్పడటానికి దారితీస్తుంది. 

కెఫిన్

కెఫిన్ ను తీసుకోవడం వల్ల శరీరంలో కార్టిసాల్ పెరుగుతుంది.  కార్టిసాల్ అనేది ఒత్తిడి హార్మోన్. ఇది ఒత్తిడి పెరిగినప్పుడు విడుదల చేస్తుంది. ఈ స్పైక్ మీ శరీరం నూనెను అధికంగా ఉత్పత్తి చేయడానికి కారణమవుతుంది కూడా. వీటికి తోడు మద్యపానం, స్మోకింగ్ కూడా మొటిమలను పెంచుతాయి. అందుకే వీటికి దూరంగా ఉండండి. 
 

నూనెలో వేయించిన ఆహారాలు

నూనెలో వేయించిన ఆహారాల వల్ల లేని పోని రోగాలొచ్చే ప్రమాదం ఉంది. ఈ ఫుడ్స్ చర్మాన్ని కూడా దెబ్బతీస్తాయి.  వీటిలో ఆయిల్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల మొటిమల ప్రమాదం పెరుగుతుంది. అలాగే శరీరంలో కొవ్వును, కేలరీలను పెంచుతుంది. అందుకే నూనెలో వేయించిన ఆహార పదార్థాలను తినకండి. వీటిని తినకపోవడం వల్ల మొటిమలు తగ్గడంతో పాటుగా శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

click me!