1.చాలా మంది తమ కర్మ బాలేదని..ఫీలౌతూ ఉంటారు. ఈ క్రమంలో.. తమ కష్టాలకు తమనే బాధ్యులుగా భావిస్తూ...తమపై తాము అయిష్టత పెంచుకుంటూ ఉంటారు. కానీ.. మనపై మనకు గౌరవం లేకపోవడాన్ని , ఇష్టం లేకపోవడం లాంటివి చేయకూడదు. మనపై మనకే గౌరవం లేకపోతే.. ఇతరులు గౌరవం ఇస్తారు అనుకోవడం పిచ్చితనం. అది కూడా మనకు చెడు కర్మ తీసుకువస్తుంది. కాబట్టి.. ముందుగా.. ఎవరిని వారు ప్రేమించుకోవడం నేర్చుకోవాలి. మిమ్మల్ని మీరు ప్రేమించుకుంటే.. ఆ కర్మను కూడా జయించవచ్చు.