అమ్మమ్మ చెప్పిన వంటింటి చిట్కాలు.. ఈ టిప్స్ తో వంట అదరహో..

First Published | Dec 12, 2023, 3:52 PM IST

మీరు గమనించారో? లేదో? మన అమ్మమ్మల, నానమ్మల జుట్టు మొత్తమే తెల్లగా ఉండదు. అంతకాదు ఎంతో బలంగా కూడా ఉంటారు. ఎందుకంటే అప్పట్లో వారి ఆహారపు అలా ఉండేవి మరి. నిజానికి అమ్మమ్మల నుంచి మనం ఎన్నో విషయాలను నేర్చుకోవచ్చు. వారికున్న అనుభవం, పరిజ్ఞానంతో వాళ్లు సమస్యలను చిటికెలో పరిష్కరిస్తారు. ముఖ్యంగా వంటింట్లో ఎలాంటి సమస్యలనైనా ఇట్టే చక్కబెట్టేస్తారు. 
 

వంట చేయాలంటే ఓపిక ఖచ్చితంగా ఉండాలి. ఏదో చేశామన్నట్టు చేస్తే అవి టేస్ట్ అసలే కావు. ముఖ్యంగా ఎవరూ తినలేరు కూడా. అయితే కొన్ని కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కూడా వంటల టేస్ట్ పోతుంది. అంటే ఉప్పు ఎక్కువగా కావడం, కూరల్లో చారు మరీ ఎక్కువ కావడం, గులాబ్ జామూన్ లోపల గట్టిగా ఉండటం వంటివి సమస్యలు వస్తుంటాయి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో తోచదు. అయినా వంటను కంప్లీట్ చేసిన తర్వాత మార్చడానికి ఏమీ ఉండదు. ముఖ్యంగా కొన్నింటిని. అయితే కొన్ని అమ్మమ్మలు చెప్పిన చిట్కాలతో వంటను టేస్టీగా చేయొచ్చు. అంటే ఉప్పు ఎక్కువవైనా, కారమెక్కువైనా సరిచేయొచ్చు. ఇంతకీ ఆ చిట్కాలేంటో తెలుసుకుందాం పదండి. 

ముల్లంగి

రెసిపీ-1

ముల్లంగి కూరను తినేవారు చాలా తక్కువ మందే ఉంటారు. ఎందుకంటే వీటిని కేవలం డయాబెటీస్, బీపీ పేషెంట్లే తినాలని చాలా మంది అనుకుంటారు. నిజానికి వీటిని ఎవ్వరైనా తినొచ్చు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే ముల్లంగిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అసలు దీన్ని ఏం చేయాలో చాలా మందికి తెలియదు. కానీ ఈ వాటర్ ను కూడా మనం ఎన్నో విధాలుగా ఉపయోగించుకోచ్చు. 
 

Latest Videos


అమ్మమ్మ చిట్కా

ముల్లంగిని మెత్తగా తరిగిన తర్వాత దానిలోంచి వాటర్ వస్తుంటుంది. అయితే దీనిని ఎన్నో విధాలుగా ఉపయోగించుకోవచ్చు. ముల్లంగి వాటర్ నే కాదు సొరకాయ వాటర్ ను కూడా మనం ఉపయోగించుకోవచ్చు. అంటే ఈ వాటర్ తో మనం పిండిని తడపొచ్చు. అలాగే సూప్స్ లేదా వెజిటబుల్ గ్రేవీని తయారు చేసుకోవచ్చు. ఇది మీ వంట టేస్ట్ ను అస్సలు మార్చదు. కానీ మీ ఆరోగ్యానికి మాత్రం మేలు చేస్తుంది. 
 


రెసిపీ- 2

ఇంట్లో హల్వా అయినా, గులాబ్ జామూన్ అయినా, కేక్ అయినా సరే.. ఇంట్లో తయారుచేస్తే మార్కెట్ లో కొన్ని వాటిలా అస్సలు ఉండదు. కానీ కొన్ని చిట్కాలతో అచ్చం మార్కెట్ లో కొన్న వాటిలా తయారుచేయొచ్చు. అదెలాగంటే?

అమ్మమ్మ చిట్కా..

గులాబ్ జామూన్ ను మార్కెట్ లో తెచ్చిన వాటిలా తయారు చేయాలనుకుంటే కేక్ లేదా మరేదైనా స్వీట్ కు .. మొదటి ఫార్ములా ప్రకారం.. దానిలో అందులో చిటికెడు ఉప్పును కలపండి. ఇది మీ తీపి వంటకాల రుచిని పెంచుతుంది. అలాగే మార్కెట్ వంటి రుచిని ఇస్తుంది.
 

ఆమ్లేట్


రెసిపీ- 3

చాలా మందికి ఆమ్లెట్  వంకర టింకరగా వస్తుంది. అలాగే దాన్ని తీస్తుంటే చిరిగిపోతుంది. ఇలా చిరిగిపోకూడదంటే ఏం చేయాలో తెలుసా? 

అమ్మమ్మ చిట్కా.. 

ఆమ్లెట్ మెత్తగా, రౌండ్ గా రావాలంటే దీనిలో రెండు టీస్పూన్ల పాలను కలపండి. దీనివల్ల ఆమ్లెట్ మునుపటి కంటే మరింత స్మూత్ గా వస్తుంది. అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. 
 

రెసిపీ- 4

కూరగాయల గ్రేవీ రంగు, రుచిని పెంచడానికి చిట్కా

అమ్మమ్మ చిట్కా.. 

దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఇందుకోసం మీరు ఉల్లిపాయలను వేయించేటప్పుడు దాంట్లో అర టీస్పూన్ చక్కెరను వేయండి. ఇలా చేయడం వల్ల గ్రేవీలోని షుగర్ ను క్యారమైజ్ చేసి మంచి కలర్ ను ఇవ్వడంతో పాటుగా రుచిని కూడా పెంచుతుంది.

click me!