2024 లో తప్పకుండా చూడాల్సిన పుణ్యక్షేత్రాలు ఇవి

First Published | Dec 12, 2023, 2:16 PM IST

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అందులో మన దేశంలో మనం తప్పక చూడాల్సిన దేవాలయాలు చాలానే ఉన్నాయి. టాప్ 10 లో ఉన్న ప్రసిద్ధ దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

ప్రపంచంలోనే పురాతన నాగరికతగా గుర్తింపు పొందిన దేశం ‘భారతదేశం’. మనదేశం సాంస్కృతిక, నైతిక విలువల లాగే చాలా విశాలమైనది. ప్రపంచవ్యాప్తంగా.. మన దేశం అంతులేని, విభిన్నమైన నమ్మకాలు, ఆచారాలు, సంప్రదాయాలు, నైతిక విలువల దేశంగా గుర్తింపు పొందింది. మీకు తెలుసా? మన దేశం ప్రపంచంలోని మరే ఇతర ప్రాంతం లేదా దేశంలో పోటీ పడదు.  మన దేశాన్ని విభిన్న ప్రజలు, సంస్కృతులున్న వారు పాలించారు. వీరికి సంబంధించిన ఆనవాళ్లను మనం భారతదేశం అంతటా చూస్తాం. దీనివల్లే భారతదేశపు నిజమైన అస్తిత్వం, సంప్రదాయం కనుమరుగయ్యిందని అంటుంటారు చరిత్రకారులు. అయితే ప్రజల ఐక్యత, భిన్నత్వం దేశ కీర్తిని, నైతిక విలువలను నిలబెట్టాయి. ఫలితంగా భారతదేశంలో పురాతన యుగాలకు చెందిన ఎన్నో దేవాలయాలు స్థిరపడ్డాయి.  ఇప్పటికీ అవి చెక్కు చెదరకుండా ఉన్నాయి

భారతదేశం ఎన్నో పురాతన, ఆధునిక వాస్తుశిల్పం నిర్మించిన దేవాలయాలు,పుణ్యక్షేత్రాల భూమిగా కూడా ప్రసిద్ది చెందింది. అంతేకాదు దేశం ప్రపంచంలోనే ప్రధాన పర్యాటక కేంద్రంగా మారడానికి ఇది కూడా ఒక కారణమే.  దేశ పర్యటనలో మీరు సందర్శించగల భారతదేశంలోని టాప్ 10 ప్రసిద్ధ దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
 


Brihadisvara Temple

1. బృహదీశ్వర ఆలయం

తమిళనాడులో ఉన్న బృహదీశ్వర ఆలయం ఎంతో ఫేమస్. ఈ ఆలయాన్ని రాజరాజేశ్వరం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయాన్ని క్రీస్తుశకం 1010లో నిర్మించారు. ఈ హిందూ దేవాలయం వాస్తుశిల్పం, డిజైన్స్ తో తమిళనాడు సాంస్కృతిక, నైతిక విలువలను వర్ణిస్తుంది. ఈ  పుణ్యక్షేత్రం భారతదేశంలో ప్రసిద్ధి చెందిన శివాలయం. దీనికున్న చారిత్రక ప్రాముఖ్యత వల్ల ఇతర దేశాల వారు కూడా దీన్నిచూడటానికి వస్తారు.  ఈ బృహదీశ్వరాలయంలో రాముడు, కృష్ణుడు, అమ్మవారి విగ్రహాలతో పాటుగా శివుడి విగ్రహం కూడా ఉంటుంది. అలాగే ఇతర దేవతలు, దేవుళ్ల విగ్రహాలు కూడా ఉంటాయి. 
 

శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం

2. శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం

పవిత్రమైన శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగ ఆలయం గుజరాత్ లో ఉంది. ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత పవిత్రమైన పుణ్యక్షేత్రాలలో ఒకటిగా ప్రజాదరణ పొందుతోంది. అంతేకాదు ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఇతర దేశాల ప్రజలు కూడా వస్తూ ఉంటారు. ఈ ఆలయాన్ని 1951 లో స్థాపించారు. అప్పటి నుంచి శివాలయం డిజైన్స్, వాస్తుశిల్పం పరంగా మార్పులకు గురైంది. కానీ పరమేశ్వరుడని పట్ల భక్తుల ఆధ్యాత్మికత, భావన ఎప్పటికీ మారలేదు. 
 

Badrinath Temple

3. బద్రీనాథ్

భారతదేశంలో ఉన్న అత్యంత ప్రసిద్ధ పవిత్ర దేవాలయాలలో ఒకటి బద్రీనాథ్ ఆలయం ఒకటి. ఇది భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయాల ఒడిలో ఉంది. మోక్షం పొందడానికి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో బద్రీనాథ్ ఒకటి. బద్రీనాథ్ ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం విష్ణుమూర్తికి అంకితం చేయబడింది. ప్రతి ఏడాది భక్తులు ఈ పుణ్యక్షేత్రాలకు పోటెత్తుతారు. ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు బద్రీనాథ్ ఆలయాన్ని సందర్శించొచ్చు. ఈ సమయంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. 
 

4. పూరీ శ్రీ జగన్నాథ ఆలయం

శ్రీ జగన్నాథ ఆలయం భారత తూర్పు తీరంలో ఒడిషాలో ఉంది. ఇది పురాతనమైన దేవాలయం. ఈ ఆలయాన్ని 1161 లో స్థాపించారు. శ్రీ కృష్ణుడి రూపమైన జగన్నాథ దేవుడి పేరు మీద ఈ ఆలయాన్ని నిర్మించారు. ఒడిషాలో ఉన్న ఈ ఆలయం వార్షిక రథయాత్ర లేదా రథోత్సవానికి చాలా ప్రసిద్ధి చెందింది. 
 

గోల్డెన్ టెంపుల్

5. గోల్డెన్ టెంపుల్

అమృత్ సర్, భారత రాష్ట్రమైన పంజాబ్ లో ఉన్న "గోల్డెన్ టెంపుల్" ఎంతో ప్రసిద్ధి చెందింది. పంజాబ్, భారతదేశంలో ఉన్న ప్రజలు ఈ పుణ్యక్షేత్రాన్ని తప్పక సందర్శిస్తారు. ఈ ఆలయం సిక్కు మతంపై విశ్వాసం ఉన్న భారతదేశ ప్రజలందరికీ చెందుతుంది. అద్భుతమైన వాస్తుశిల్పంతో నిర్మించిన స్వర్ణ దేవాలయం భక్తులకు ఆకట్టుకుంటుంది. ఇక్కడికొచ్చిన భక్తులకు, సందర్శకులందరికీ ఆహారం, నీరు,డెజర్ట్ లను ఉచితంగా అందిస్తారు. 
 

6. వైష్ణోదేవి ఆలయం

మా వైష్ణో దేవి ఆలయం జమ్మూ కాశ్మీర్ లోని త్రికూట హిల్స్ లో ఉంది. ఈ ప్రసిద్ధ ఆలయం హిందూ దేవత "మాతా దుర్గాదేవి"కి అంకితం చేయబడింది. అలాగే జమ్మూలోని ఈ పుణ్యక్షేత్రం దాని చారిత్రక ప్రాముఖ్యత, ఆధ్యాత్మికత కారణంగా దుర్గామాత దర్శనం కోసం ప్రతిఏటా ఎంతో మంది భక్తులకు ఇక్కడికి వస్తూ ఉంటారు. హిందూ ఉత్సవాలు, దుర్గమాత పూజల సందర్భంగా ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ ఆలయంలో దుర్గామాతను ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు మంత్రోచ్ఛారణలు చేయడం, యజ్ఞం నిర్వహిస్తారు. 
 

మోతీ డుంగ్రి గణేష్ ఆలయం

7. మోతీ డుంగ్రి గణేష్ ఆలయం

మోతీ డుంగ్రి గణేష్ ఆలయం భారతదేశంలోని ప్రసిద్ధ గణేషుడి ఆలయం. ఈ ఆలయం వినాయకుడికి అంకితం చేయబడింది. ఈ ఆలయం రాజస్థాన్ లోని జైపూర్ లో ఉంది. అంతేకాదు ఈ ఆలయం జైపూర్ పర్యాటకంలో కూడా ఒక ముఖ్యమైన భాగంగా మారింది. భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయాన్ని భారతదేశంలో ఉన్న భక్తులంతా సందర్శిస్తారు.ఈ ఆలయంలో భక్తులు కిటకిటలాడుతారు.
 

కేదార్ నాథ్ ఆలయం

8. కేదార్ నాథ్ ఆలయం

కేదార్నాథ్ ఆలయం భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో మందాకిని నదికి సమీపంలో ఉంది. ఈ ఆలయం భారతదేశపు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, ప్రసిద్ధ ఆలయం. ఈ ఆలయం పరమేశ్వరుడి పేరు మీద నిర్మించబడింది. సనాతన ధర్మంలో.. ఈ ఆలయం భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన, పురాతన దేవాలయాలలో ఒకటి. అంతేకాదు ఇది చార్ ధామ్ యాత్రలో భాగం అవుతుంది కూడా.
 

రామనాథస్వామి ఆలయం

9. రామనాథస్వామి ఆలయం

రామనాథస్వామి ఆలయం భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఒకటి. ఇది తమిళనాడు రాష్ట్రం ఉంది. ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. శివుడి భక్తులకు ఈ ఆలయం ఎంతో పవిత్రమైన పుణ్యక్షేత్ర. 

Dwarka

10. శ్రీ ద్వారకాధీష్ ఆలయం

శ్రీ ద్వారకాదీష్ ఆలయం ఒక హిందూ దేవాలయం. ఈ ఆలయంలో శ్రీ కృష్ణుడు కొలువై ఉన్నాడు. ఈ  శ్రీకృష్ణుని ఆలయం జగత్ మందిర్ గా కూడా ప్రసిద్ధి చెందింది. గుజరాత్ నగరంలో ఉన్న ద్వారకాదీష్ దేవాలయంలో దేవతలు, శ్రీ కృష్ణుడి వివిధ సొగసైన, మనోహరమైన విగ్రహాలు ఉన్నాయి. శ్రీ కృష్ణ దేవాలయం ఒక పురాతన నిర్మాణ శైలిని కలిగి ఉంటుంది. ఇది మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. అలాగే ఆధ్యాత్మిక భావాలను నింపుతుంది. 

Latest Videos

click me!