Diabetes : డయాబెటీస్ పేషెంట్లు ఆహారం విషయంలో ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగిపోయే ప్రమాదం ఉంటుంది. అయితే కొన్ని ఫుడ్స్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఎంతో సహాయపడతాయి. అవేంటంటే..
కాకరకాయ రసం.. కాకరకాయ నోటికి చేదుగా అనిపించినప్పటికీ దీనిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. అందుకే దీనిని తప్పక తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే మధుమేహులకు కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. మధుమేహులు రోజుకు ఒక గ్యాస్ కాకరకాయ జ్యూస్ ను తాగడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఉదర సమస్యలు కూడా నయమవుతాయి.
27
నేరుడు పండ్లు.. డయాబెటీస్ పేషెంట్లు తీసుకోవాల్సిన ముఖ్యమైన పండ్లలో నేరేడు పండ్ల ముందు వరుసలో ఉంటాయి. ఈ పండ్లు వారికి దివ్య ఔషదంతో సమానం. వీటిలో యాంట ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వారి రక్తంలోని షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతాయి. నేరేడు పండ్ల గింజలను బాగా ఎండబెట్టాలి. వీటిని పౌడర్ లా చేసుకుని వాటర్ లో కలిపి తాగితే వీరి ఆరోగ్యానికి మంచి జరుగుతుంది.
37
బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరి.. బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే షుగర్ వ్యాధి బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే షుగర్ పేషెంట్లు, ఇతరులు కూడా బ్రేక్ ఫాస్ట్ ను తీసుకోకుండా ఉండకూడదని నిపుణులు చెబుతున్నారు.
47
డయబెటీస్ కంటోల్ లో ఉండాలంటే ఆహారం, చికిత్స తో పాటుగా మంచి జీవనశైలి కూడా అవరమే అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
57
ఈ ఉరుకుల పరుగుల జీవితంలో వయసు మీద పడుతున్న వారే కాదు యువత, మధ్య వయస్కులు కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఈ వ్యాధి సోకూడదంటే మనం కొన్ని అలావాట్లను మానుకుని మరికొన్ని అలవాట్లను అలవర్చుకోవాల్సి వస్తుంది.
67
మధుమేహులు మంచి ఆహారంతో పాటుగా ప్రతిరోజూ రన్నింగ్, వాకింగ్ వంటి వ్యాయామాలను తప్పకుండా చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారి రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి.
77
శారీరక శ్రమ చేయనివారికే డయాబెటీస్ ఎక్కువగా వస్తుంది. ఇలాంటి వారు రోజుకు 30 నిమిషాల పాటు చిన్నపాటి ఎక్సర్ సైజెసె లేదా స్మిమ్మింగ్, బరువులు ఎత్తడం, యోగా, సైక్లింగ్, జాగింగ్ వంటివి చేస్తూ ఉండాలి. ఇలా చేస్తే షుగర్ లెవెల్స్ బాగా తగ్గుతాయి.