పెదాలు పగలకుండా ఉండాలంటే ఇలా చేయండి

Published : Jun 09, 2023, 03:08 PM IST

పెదవులపై ఉన్న చర్మం ఇతర భాగాల్లోని చర్మం కంటే చాలా సన్నగా ఉంటుంది. అందుకే పెదవుల రక్షణ చాలా ముఖ్యం. మీ పెదవుల సహజ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేయాలంటే..   

PREV
17
పెదాలు పగలకుండా ఉండాలంటే ఇలా చేయండి
chapped lips

పెదాలు పొడి బారడానికి, పగలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. పెదవులపై ఉన్న చర్మం ఇతర శరీర భాగాల్లోని చర్మం కంటే సన్నగా ఉంటుంది. అందుకే పెదాలు పొడిబారుతుంటాయి. కాబట్టి పెదవుల రక్షణ చాలా ముఖ్యం. మీ పెదాలు పొడిబారకుండా, పగలకుండా ఉండేందుకు ఎలాంటి చిట్కాలను ఫాలో కావాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

27
lips

షియా బటర్

పెదాలను ఆరోగ్యంగా, అందంగా ఉంచేందుకు షియా బటర్ బాగా సహాయపడుతుంది. షియా బటర్ లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పెదవుల పొడిబారడాన్ని తొలగించడానికి సహాయపడతాయి.
 

37
lips

నెయ్యి

నెయ్యి చర్మ సంరక్షణకు తోడ్పడే దివ్య ఔషధం. ఇది పెదవులకు అవసరమైన పోషణను అందించడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం పెదవులకు నెయ్యి రాసుకుని  కొద్దిసేపు మసాజ్ చేయాలి. 

కొబ్బరి నూనె

కొబ్బరినూనెను మన జుట్టుకే కాదు పెదాలకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.  ఇందుకోసం కొబ్బరి నూనెను పెదాలకు అప్లై చేసి కాసేపు మసాజ్ చేయండి. దీనివల్ల పెదవులు పొడిబారడం తగ్గుతుంది. 
 

47

తేనె

తేనె నేచురల్ మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. అందుకే తేనె పొడి పెదాలను నివారించడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం తేనెను నేరుగా పెదవులపై అప్లై చేసి మసాజ్ చేయండి. తేనె పెదాలను మృదువుగా  మారేలా చేస్తుంది. 

పంచదార

పంచదార మంచి స్క్రబ్బర్. ఇది పెదవుల్లోని మృతకణాలను తొలగించి పెదవుల అందాన్ని పెంచుతుంది. ఇందుకోసం ఒక చెంచా పంచదార తీసుకుని అందులో మూడు లేదా నాలుగు చుక్కల ఆలివ్ ఆయిల్ కలిపి అందులో అర చెంచా తేనె కలిపి పెదవులకు అప్లై చేయండి. తర్వాత వేళ్లతో పెదాలను సున్నితంగా రుద్దండి. 10 నిమిషాల తర్వాత కడిగేసుకోండి.
 

57

కీరదోసకాయ

కీరదోసకాయ కూడా పెదాలను అందంగా మార్చడానికి సహాయపడుతుంది. ఇందుకోసం కీరదోసకాయ ముక్కలతో పెదవులను మసాజ్ చేయండి. ఇది మీ పెదాలు పొడిబారకుండా చేస్తుంది. 

కలబంద జెల్

కలబంద జెల్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. రాత్రి పడుకునే ముందు కొద్దిగా కలబంద జెల్ ను తీసుకుని నేరుగా పెదవులకు అప్లై చేయండి. దీని వల్ల పెదవులపై పొడిబారడం తొలగిపోతుంది.
 

67
pink lips

గ్రీన్ టీ

గ్రీన్ టీని మన ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. పెదవులు పొడిబారకూడదంటే గ్రీన్ టీని పెదవులకు అప్లై చేసి కాసేపు మసాజ్ చేయండి. తర్వాత బాగా తుడిచి లిప్ బామ్ అప్లై చేయండి.
 

77

ఆలివ్ ఆయిల్

రాత్రి నిద్ర పోవడానికి ముందు కొద్దిగా ఆలివ్ ఆయిల్ ను తీసుకుని పెదాలకు రాయండి. ఇది పెదాలను తేమగా, అందంగా చేస్తుంది. 

పంచదార, నిమ్మరసం

పంచదార, నిమ్మరసం కలిపి పెదవులకు అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో పెదాలను తుడుచుకోవాలి. ఇది మీ పెదాలు అందంగా అయ్యేందుకు సహాయపడుతుంది.

click me!

Recommended Stories