ఎంత సంపాదించినా.. చేతిలో చిల్లిగవ్వ కూడా లేదని చాలా మంది ఆందోళన చెందుతుంటారు. కొంతమంది అయితే ఏకంగా ఇంట్లో ఉన్నవాళ్లంతా సంపాదిస్తుంటారు. కానీ బ్యాంక్ బ్యాలెన్స్ మాత్రం ఉండనే ఉండదు. నెల సంపాదన మొత్తం ఒక్క వారంలోనే ఖర్చు పెట్టేస్తుంటారు. కానీ దీనివల్ల నెలాఖరులో కుటుంబం గడవడం కష్టమవుతుంది. అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు కూడా పడాల్సి వస్తుంది. అందుకే ఖర్చులను తగ్గించుకుని డబ్బును ఎలా ఆదా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఖర్చుల విషయంలో జాగ్రత్త
కొంతమంది అసలు దేనికి ఖర్చు పెడుతున్నామో తెలియకుండా.. డబ్బులను ఖర్చు చేసేస్తూ ఉంటారు. అవసరం ఉన్నదానికి, లేనిదానికి ఖర్చు చేసుకుంటూ పోతే మీ సంపాదన మొత్తం ఖర్చులకే పోతుంది. కానీ చేతిలో చిల్లి గవ్వ కూడా మిగలదు. అందుకే మీరు దేని దేనికి ఖర్చు చేస్తున్నారో ఒక లీస్ట్ తయారుచేయండి. అలాగే ఖర్చుల బిల్లులను ఒక దగ్గర పెట్టండి. అలాగే ఖర్చులను నోట్ బుక్ లో రాసి పెట్టండి. ఒక్క రూపాయి ఖర్చు చేసినా.. దానిని నోట్ చేయడం మర్చిపోకండి. దీనివల్ల మీరు వేటివేటికి ఎంత ఖర్చు చేస్తున్నారో తెలుసుకుంటారు.
బడ్జెట్ జనరేషన్
ఏవి పడితే అవి కొనండి. డబ్బులను అనవసరంగా ఖర్చు చేయకండి. అవసరమైన వాటికే ఖర్చు చేయండి. అలాగే ప్రతి నెలా బడ్జెట్ రూపొందించండి. చదువుకు, వైద్య ఖర్చులకు. కిరాణా సామాగ్రికి, పనికి వెళ్లడానికి ఇంధనం కోసం మీ బడ్జెట్ లో తగిన ఏర్పాట్లు చేసుకోండి.
రవాణా ఖర్చు
మీరు పనికి వెళ్లడానికి బైక్ ను ఉపయోగిస్తారా? కానీ బైక్ నడవడానికి ప్రతిరోజూ వంద రూపాయల పెట్రోల్ అన్నా కొట్టించాలి. అదే మీరు బస్సులో వెళితే ఇంత ఖర్చు ఉండదు. అవును మీరు ఆఫీసుకు మాత్రమే వెళ్తున్నట్టైతే ప్రభుత్వ బస్సులో ప్రయాణం చేయండి. మీరు నెలకు రూ.1,000 పాస్ తీసుకుంటే రూ.2,000 లను ఆదా చేసుకోవచ్చు. కానీ ఒకే రోజు వేర్వేరు ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఇది వర్కౌట్ అవ్వదు. బస్సులో అసౌకర్యం ఉండకూడదంటే మీరు కొంచెం ముందుగానే ఆఫీసుకు వెల్లండి.
బల్క్ లో కొనండి
పప్పులు, ఉప్పులు, బియ్యం వంటి నిత్యావసర సరుకులను బల్క్ గా కొనే ప్రయత్నం చేయండి ఇకనుంచి. మీకు తెలుసా? ఇలా కొంటే.. 25 కిలోల బియ్యం బస్తా కొంటే మీకు రూ.50 నుంచి రూ.100 ఆదా అవుతాయి. బియ్యం పాడయ్యాయి అనే ముచ్చటే ఉండదు. కాబట్టి మీరు ఈ నెల మిగిలిన బియ్యాన్ని వచ్చే నెలలో కూడా వాడుకోవచ్చు. రేషన్ బియ్యంలో సరఫరా చేసే పంచదార కూడా మంచి నాణ్యతో ఉంటుంది. దుకాణాల్లో కిలో చక్కెర రూ.50 నుంచి రూ.60 వరకు అమ్ముతుంటారు. అదే రేషన్ లో కొంటె మీరు 40 రూపాయలు ఆదా చేయొచ్చు.
ముఖ్యమైన వాటినే కొనండి
మీరు ఏది కొనాలనుకున్నా అది ముఖ్యమైనదా? కాదా? ఇది అక్కరకొచ్చేదేనా? అని ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఇంటికి ఏది ముఖ్యమో వాటికే ఖర్చు చేస్తారు. అనవసర విషయాలకు ఖర్చు చేయకండి. అయితే కొన్ని కంపెనీల్లో ఓవర్ టైమ్ పనిచేస్తే ప్రత్యేక వేతనం కూడా లభిస్తుంది. మీ కుటుంబం కోసం మీరు ఓవర్ టైమ్ పనిచేయాలనుకుంటేదీన్ని ఫాలో అవ్వండి. అలాగే ఆరోగ్యం విషయంలో కూడా కేర్ తీసుకోండి.
రెస్టారెంట్ కు దూరంగా ఉండండి
కనీసం నెలకోసారైనా ఫ్యామిలీతో కలిసి రెస్టారెంట్ లో నచ్చిన భోజనం చేయాలనుకుంటాం. కానీ మీ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే రెస్టారెంట్ కు వెళ్లడం మానుకోండి. అలాగే ఆన్లైన్ లో ఆర్డర్ చేయడం కూడా మానేయండి. ఆన్లైన్ లో ఆర్డర్ చేసి 30-40 నిమిషాల్లో ఇంట్లోనే హెల్తీ ఫుడ్ ను వండి ఇంటిళ్లిపాది తినొచ్చు.
విద్యుత్ ఆదా
కొంతమంది ఎప్పుడూ ఇంట్లో ఏసీని వాడుతుంటారు. అది వానాకాలమైనా, చలికాలమైనా వాడుతుంటారు. కానీ చలికాలంలో ఏసీ అవసరం ఉండదు. ఏసీ వాడటం అలవాటు చేసుకుంటే ఎండ ఎక్కువగా లేనప్పుడు కూడా ఏసీ ఆన్ చేస్తుంటారు. మీరు డబ్బును ఆదా చేయాలనుకుంటే మాత్రం వీలైనంత వరకు వేసవి, వేడి వాతావరణంలో మాత్రమే ఏసీని ఉపయోగించండి. అలాగే ఇంట్లో ఎవరూ లేనప్పుడు అంటే బయటకు వెల్లినప్పుడు ఇంట్లో లైట్లను, ఫ్యాన్లు, ఏసీలను ఖచ్చితంగా ఆఫ్ చేయాలి.