పెరుగులో దాల్చిన చెక్క: ఆరోగ్యానికి ఎలా మేలు చేస్తుంది?

First Published | Aug 30, 2024, 11:51 AM IST

దాల్చిన చెక్కను పెరుగులో కలుపుకుని తినడం వల్ల జీర్ణ ఆరోగ్యం మెరుగుపడుతుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి మరియు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

దాదాపు మన అందరి కిచెన్ లో మసాలా దినుసులు ఉంటాయి. ఈ మసాలా దినసులు.. వేసిది కొంచెం అయినా.. వంటకు విపరీతమైన సువాసను, రుచిని అందిస్తాయి.  ఇవి రుచికి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. అలా రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క ఒకటి. దాల్చిన చెక్కను మనం బిర్యానీలో వేసుకుంటాం. మరి కొందరు.. దాల్చిన చెక్కను డీటాక్సింగ్ డ్రింక్ లా పని చేస్తుంది. మరి.. ఇదే దాల్చిన చెక్క పొడిని పెరుగులో వేసుకొని తింటే ఏమౌతుందో తెలుసా? దీని వల్ల మన ఆహారానికి కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ దాల్చిన చెక్క పొడిని ఎక్కువగా తీసుకోకూడదు. గిన్నెడు పెరుగులో.. చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి తినాలి. అది కూడా భోజనం తర్వాత  తినడం వల్ల మరింత ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా జీర్ణ సమస్యలు రాకుండా.. ఆహారం సులభంగా జీర్ణమవ్వడానికి సహాయపడుతుంది.మరీ ఎక్కువగా దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల,... ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. ఎందుకంటే.. దీనిలో ఉండే కొన్ని ప్రాపర్టీలు.. మానవ శరీరంలో టాక్సిన్స్ పెంచడానికి కారణం అవుతాయి. అందుకే.. మరీ ఎక్కువగా కాకుండా.. పావు స్పూన్ కి మించి ఎక్కువగా తీసుకోకూడదు. అలా తక్కువగా తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు తెలుసుకుందాం..


curd

జీర్ణ ఆరోగ్యం..
దాల్చిన చెక్కలో యాంటీ మైక్రోబయల్ ప్రాపర్టీలు ఉంటాయి. ఇవి.. గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి సహాయపడతాయి.ఇక పెరుగులో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఈ రెండూ కలిపి తీసుకుంటే.. మనం ఎలాంటి ఆహారం తీసుకున్నా సులభంగా జీర్ణమౌతుంది.

curd

బ్లడ్  షుగర్ కంట్రోల్ లో..
ఈ రోజుల్లో చాలా మంది షుగర్ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. అలాంటివారు పెరుగులో దాల్చిన చెక్క పొడి వేసుకొని తింటే సరిపోతుంది షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయి.  ఈవెనింగ్ సమయంలో మంచి స్నాక్ లాగా కూడా.. పెరుగులో దాల్చిన చెక్క పొడి వేసుకొని తినొచ్చు. ఇన్సులిన్ ని మేనేజ్ చేయడంలో సహాయపడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్స్...
దాల్చిన చెక్కలో  యాంటీ ఆక్సిడెంట్స్్ పుష్కలంగా ఉంటాయి. ఇది.. మన శరీరాన్ని ఒత్తిడి నుంచి బయటపడటానికి సహాయపడుతుంది. ఇక.. పెరుుగ తో కలిపి తీసుకోవడం వల్ల.. శరీరానికి ఎక్కువ మేలు జరుగుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సమస్య ఏదైనా ఉంటే... అది కాస్త బ్యాలెన్స్డ్ గా మారుతుంది.

యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీలు...
ఈ రోజుల్లో చాలా మంది మహిళలు.. పీసీఓడీ, పీసీఓఎస్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటివారు.. ఇలా పెరుగులో దాల్చిన చెక్క పొడి వేసుకొని తినడం వల్ల... ఆ సమస్యలను కాస్త కంట్రోల్ చేసుకోవచ్చు. పీరియడ్ సంబంధిత సమస్యలు రాకుండా ఆపడంలోనూ సహాయపడుతుంది. హార్మోనల్ హెల్త్ కి చాలా బాగా సహాయపడుతుంది.

బరువు తగ్గడం..
పెరుగులో దాల్చిన చెక్క పొడి వేసుకొని తినడం వల్ల... బరువు కూడా ఈజీగా తగ్గచ్చు. చాలా మంది ఫుడ్ క్రేవింగ్స్ తో.. ఏవేవో తినడం వల్ల.. బరువు పెరిగేస్తారు. అయితే... పెరుగు, దాల్చిన చెక్క పొడి కాంబినేషన్ తినడం వల్ల.. ఫుడ్ క్రేవింగ్స్ కంట్రోల్ అవుతాయి. దాని వల్ల... శరీరానికి హై ప్రోటీన్ అంది.. ఈజీగా బరువు తగ్గడానికి సహాయం చేస్తుంది.

Latest Videos

click me!