కలబంద నుంచి ఉల్లిపాయ రసం వరకు.. జుట్టు పెరగడానికి వీటిని ట్రై చేయండి

Published : Jun 17, 2023, 03:04 PM ISTUpdated : Jun 17, 2023, 03:05 PM IST

విటమిన్స్ లోపించడం వల్ల జుట్టు బలహీనపడుతుంది. అలాగే జుట్టు విపరీతంగా రాలుతుంది. విటమిన్లు ఎక్కువగా  ఉండే ఆహారాలను తింటే మీ జుట్టు తిరిగి బలంగా మారుతుంది. అలాగే పొడుగ్గా కూడా పెరుగుతుంది. 

PREV
16
 కలబంద నుంచి ఉల్లిపాయ రసం వరకు.. జుట్టు పెరగడానికి వీటిని ట్రై చేయండి
hair care

హెయిర్ ఫాల్, చుండ్రు.. చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్యలు. జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉంటాయి.  అయితే మీరు కొన్ని జీవనశైలిలో మార్పులు చేసుకుంటే మీ జుట్టు సేఫ్ గా ఉంటుంది. నిజానికి జుట్టు బలంగా ఉండేందుకు, పెరిగేందుకు విటమిన్లు అవసరమవుతాయి. మన శరీరంలో విటమిన్స్ లోపించడం వల్లే జుట్టు బలం తగ్గుతుంది. అందుకే జుట్టు ఆరోగ్యం కోసం విటమిన్లు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తినాలి. 

26

మన జుట్టును రక్షించడానికి  కొన్ని పనులను కూడా చేయాల్సి ఉంటుంది. కొన్ని హెయిర్ మాస్క్ లను ఉపయోగించడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. అలాగే మీ  జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుంది. మరి ఇంట్లోనే తయారుచేసుకునే కొన్ని హెయిర్ మాస్క్ ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

36
hair care

గంజి 

అవసరాన్ని బట్టి ఒక కప్పు గంజి నీటిలో 20 గ్రాముల మెంతులను నానబెట్టండి. ఈ మెంతులను రాత్రంతా గంజి నీటిలోనే ఉంచాలి.  ఉదయాన్నే మెంతులను వడగట్టుకోవాలి. ఈ కంజి నీటిని తడి జుట్టుపై స్ప్రే చేయొచ్చు లేదా బ్రష్ తో అప్లై చేయొచ్చు. పది నిమిషాల తర్వాత కడిగేసుకోవాలి.
 

46
Image: Getty

మెంతుల పేస్ట్ 

ముందు రోజు రాత్రి మెంతులను నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం  ఈ మెంతులను పేస్ట్ గా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇందులో సేజ్ పువ్వు, ఆకులు, పెరుగు, గుడ్లు, కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ వేసి కలపాలి. గంట తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

56
hair care

ఉల్లిపాయ రసం

ఒకటి లేదా రెండు ఉల్లిపాయలను తీసుకుని వాటి పొట్టు తీసి శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసి జ్యూస్ గా తీసుకోవాలి. ఈ జ్యూస్ ను తలకు, జుట్టుకు బాగా అప్లై చేయాలి. అరగంట తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే జుట్టు రాలడం తగ్గి జుట్టు బాగా పెరుగుతుంది. 
 

66


కలబంద జెల్

అరకప్పు కొబ్బరినూనెలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల కలబంద జెల్ ను వేయాలి. వీటిని చెంచాతో బాగా కలపాలి. కాసేపటి తర్వాత ఈ మిశ్రమం మంచి పేస్ట్ గా మారుతుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి బాగా మసాజ్ చేయాలి. జుట్టు మూలాల నుంచి చివర్ల వరకు సరిగ్గా అప్లై చేయాలి. కొన్ని గంటల తరువాత మీ జుట్టును కడగాలి. మీరు దీన్ని వారానికి రెండుసార్లు ప్రయత్నించొచ్చు.

click me!

Recommended Stories