Thyroid Diet: థైరాయిడ్ పేషెంట్లు వీటిని అస్సలు తినకూడదు..

Published : May 29, 2022, 09:40 AM IST

Thyroid Diet: థైరాయిడ్ పేషెంట్లు ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా కొన్ని రకా ల ఆహారాల జోలికి అస్సలు వెళ్లకూడదు. అవేంటంటే..   

PREV
16
Thyroid Diet: థైరాయిడ్ పేషెంట్లు వీటిని అస్సలు తినకూడదు..

థైరాయిడ్ పేషెంట్లు కొన్ని రకాల ఆహారాలను తీసుకోకూడదు. ముఖ్యంగా చక్కెర, అధిక కార్బోహైడ్రేట్లు ఉన్న ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. థైరాయిడ్ గ్రంథిని నియంత్రించి, బరువు తగ్గాలనుకు వారు చక్కెర (Sugar) , కార్బోహైడ్రేట్లు (Carbohydrates) ఎక్కువుగా ఉండే ఆహారాలను తీసుకోకూడదు. వీటికి బదులుగా అధిక ఇన్సులిన్ స్థాయిలు లేని ఆహారాలు అంటే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి. 

26

ఫైబర్ (Fiber).. ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను నియంత్రించడంతో పాటుగా శరీరంలో ఉండే వ్యర్థాలను తొలగించడానికి ఎంతో సహాయపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే పండ్లు, కూరగాయలు మరియు చిక్కుళ్లను మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోండి.

36

బ్రెజిల్ గింజలు (Brazil nuts), సార్డినెస్ (Sardines), గుడ్లు మరియు చిక్కుళ్ల వంటి సెలీనియం అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. ఎందుకంటే ఇవి TSH హార్మోన్లు, సెలీనియంను ఉత్పత్తి చేయడానికి సహాయపడతాయి.
 

46

అయోడిన్ ((Iodine) ఒక ముఖ్యమైన ఖనిజంగా శరీరంలో థైరాయిడ్ పనితీరును ఉత్తేజపరచడానికి సహాయపడుతుంది. కాబట్టి మీకు హైపోథైరాయిడిజం ఉంటే చేపలు, ఉప్పు, పాల ఉత్పత్తులు (Dairy products),గుడ్ల ద్వారా అయోడిన్ స్థాయిలను పెంచడం వల్ల శరీరంలో TSH ఉత్పత్తి  పెరుగుతుంది. 
 

56

బంగాళాదుంప చిప్స్ (Potato chips), కుకీలు (Cookies), కేకులు (Cakes), ప్రాసెస్ చేసిన ఆహారాలు వంటి ఆహారాల పదార్థాలను అస్సలు తినకూడదు. ప్రాసెస్ చేసిన ఆహారాల్లో ఉప్పు ఎక్కువగా ఉండటమే కాదు..ఖణిజాలు కూడా ఎక్కువగానే ఉంటాయి. అంతేకాక ఈ ఆహారాలను రోజూ తినడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. 

66

సోయా , సోయా పాలలో ఐసోఫ్లేవోన్లు (Isoflavones)సమృద్ధిగా ఉంటాయి. ఇది హైపోథైరాయిడిజం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది థైరాయిడ్ హార్మోన్ ను శోషించుకోవడం కూడా చాలా కష్టతరం చేస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories