థైరాయిడ్ ఒక గ్రంధి. ఇది శరీరం ఎదుగుదలకు ఎంతో సహాయపడుతుంది. జీవక్రియలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. సీతాకోకచిలుక ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి మెడ ముందు భాగంలో ఉంటుంది. ఈ గ్రంథి పనితీరులో ఎటువంటి మార్పులు వచ్చినా.. శరీరంలో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి.
26
ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్లలో హెచ్చు తగ్గులు వస్తే తీవ్రమైన అలసట సమస్యను ఎదుర్కొంటారు. హైపర్ థైరాయిడిజం ఉన్నవారికి రాత్రిపూట సరిగ్గా నిద్రరాదు. దీంతో వీళ్లు రోజంతా అలసిపోయినట్లుగా కనిపిస్తారు. అయితే థైరాయిడ్ సమస్య ఉన్న వారి రోజు వారి ఆహారంలో ఈ ఆహారాలను చేర్చుకుంటే థైరాయిడ్ గ్రంథిలో ఎలాంటి మార్పులు రావు.
36
గుడ్లు (Eggs)
గుడ్డు సంపూర్ణ ఆహారం. దీనిలో అయోడిన్, ఖణిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ప్రాథమిక థైరాయిడ్ హార్మోన్ అయిన థైరాక్సిన్ ఏర్పడటంలో కీలక పాత్ర పోషిస్తుంది.
46
ఉసిరి (amla)
ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది. ఉసిరి థైరాయిడ్ గ్రంథిని ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. ఉసిరిలో నారింజ కంటే రెండు రెట్లు విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది.
56
గుమ్మడి గింజలు (Pumpkin seeds)
గుమ్మడి గింజల్లో జింక్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇవి శరీరంలో ఉండే ఇతర విటమిన్లు, ఖనిజాల శోషణకు సహాయపడతాయి. జింక్ శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి, నియంత్రణకు సహాయపడుతుంది.
66
చియా విత్తనాలు (Chia seeds)
థైరాయిడ్ ఆరోగ్యకరమైన పనితీరుకు సహాయపడే ముఖ్యమైన పోషకాలన్నింటినీ చియా విత్తనాలు కలిగి ఉంటాయి. దీనిలో ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి సహాయపడతాయి.