Pregnancy Tips: గర్భిణులు ఈ పనులను అస్సలు చేయకూడదు.. లేదంటే ప్రాణాలే పోవచ్చు జాగ్రత్త..

First Published | Mar 26, 2022, 1:46 PM IST

Pregnancy Tips: గర్భిణులు కొన్ని పనులను చేయకపోవడమే మంచిది. లేదంటే వారి ప్రాణాలే పోవచ్చు. ముఖ్యంగా వీరి రోజు వారి అలవాట్లు, తినడం, సమయానికి నిద్రపోవడం వంటివి పక్కాగా చేయాల్సి ఉంటుంది. 

Pregnancy Tips: తల్లికావడం గొప్ప వరమంటారు పెద్దలు. అయితే గర్భంతో ఉన్నప్పుడు కేవలం తల్లి గురించే కాదు .. కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా తల్లి తీసుకునే ఆహారం, అలవాట్లు, నిద్రవంటివి బిడ్డ ఆరోగ్యంపై ఎఫెక్ట్ చూపిస్తాయి. కాబట్టి ఈ విషయాల్లో అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. 

తల్లి, కడుపులో పెరుగుతున్న బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే.. కొన్నింటికి దూరంగా ఉండాల్సి వస్తుంది. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి. 


ఉడికించిన మాంసం.. ఉడికించిన మాంసాహారం, పచ్చి గుడ్లు, పొగబెట్టిన సీ ఫుడ్, పాశ్చరైజ్ చేయని పాల ఉత్పత్తులు, జున్ను వంటివి గర్భిణులు అస్సలు తినకూడదు. ఇవి వీరి ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. 

కెఫిన్.. కెఫిన్ ఎక్కువగా ఉండే వాటికి గర్భిణులు దూరంగా ఉండాలి. కెఫిన్ వల్ల తరచుగా మూత్రం రావడం, రక్తపోటు పెరగడం, Heart rate పెరగడం వంటివి జరుగుతూ ఉంటారు. కాబట్టి కెఫిన్ తీసుకోవడం మానేయడం బెటర్. 
 

మెడిసిన్.. ఇతర సమయాల్లో లాగా గర్భం దాల్చినప్పుడు మెడిసిన్స్ ను ఎక్కువగా యూస్ చేయకూడదు. ఏదైనా ఉంటే వైద్యులను సంప్రదించిన తర్వాతనే ఉపయోగించాలి. ఎందుకంటే కొన్ని రకాల మెడిసిన్స్ పిండానికి హానీ చేస్తతాయి. కాబట్టి డాక్టర్ సూచించిన మందు బిల్లలనే తినండి. కానీ మీ సొంతం వేటినీ కొని వేసుకోకండి. 

ఆల్కహాల్, స్మోకింగ్.. గర్భిణులు స్మోకింగ్, ఆల్కహాల్ కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటిని తీసుకోవడం వల్ల గర్బం పోయే ప్రమాదం ఉంది. అంతేకాదు .. వీటివల్ల ఇతర అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయి. 

ఎక్కువ సేపు కూర్చోవడం, నిలబడటం.. గర్భాదారణ సమయంలో ఆడవారు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా గర్భిణులు ఎక్కువ సేపు కూర్చోవడం, నిల్చోవడం లాంటివి అస్సలు చేయకూడదు. ఇలా చేస్తే పాదాలు వాపు వస్తాయి. కూర్చోవడంలో ఇబ్బందిగా ఉంటే.. అప్పుడప్పును నిల్చోండి. దీనివల్ల మీకు కాస్త విశ్రాంతి లభిస్తుంది.
 

Latest Videos

click me!