
ఎక్కువ మొత్తంలో పోషకాలు, తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. కనుక వీటిని తీసుకుంటే శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు (Health benefits) అనేకం. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
పుట్టగొడుగులలో విటమిన్ సి, డి, ఈ, బి6 లతో పాటు కాపర్, ఫాస్పరస్, ఐరన్, పొటాషియం, ప్రోటీన్స్, ఫైబర్ వంటి ఇతర ఖనిజాలు (Minerals) కూడా సమృద్ధిగా ఉంటాయి. అలాగే వీటితో పాటు యాంటీఆక్సిడెంట్స్ (Antioxidants) ను కూడా కలిగి ఉంటాయి. ఇవి అనేక అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి సహాయపడతాయి.
బరువు తగ్గుతారు: పుట్టగొడుగులలో ఉండే పాలిసోకరైడ్స్ (Polysaccharides) అధిక బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. అలాగే ఇది ఆకలి వేయడానికి తగ్గించి ఎక్కువసార్లు ఆహారం తీసుకోకుండా చేస్తుంది. కనుక బరువు తగ్గడానికి (Lose weight) ప్రయత్నించేవారు డైట్ లో పుట్టగొడుగులను చేర్చుకోవడం మంచిది.
మధుమేహాన్ని నివారిస్తాయి: పుట్టగొడుగులలో సహజసిద్ధమైన ఇన్సులిన్, ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి మనం తీసుకునే ఆహారం నుండి షుగర్స్ ను విడగొడతాయి. దీంతో షుగర్ లెవల్స్ (Sugar levels) పెరగవు. అంతేకాకుండా రక్తంలో షుగర్ లెవల్స్ ను తగ్గించి మధుమేహాన్ని (Diabetes) నివారిస్తాయి.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది: పుట్టగొడుగులలో సెలీనియం (Selenium) సమృద్ధిగా ఉంటుంది. ఇది శరీర రోగనిరోధక శక్తిని (Immunity) పెంచుతుంది. అలాగే సాధారణంగా వచ్చే జలుబు, జ్వరాలను నివారిస్తుంది. అంతే కాకుండా శరీరాన్ని అనేక అనారోగ్య సమస్యల నుంచి దూరంగా ఉంచుతుంది.
గర్భిణీలకు మంచిది: పుట్టగొడుగులలో పోలిక్ యాసిడ్ (Folic acid) సమృద్ధిగా ఉంటుంది. కనుక గర్భిణీ స్త్రీలు (Pregnant women) పుట్టగొడుగులను తీసుకుంటే వారికి కావలసిన పోలిక్ యాసిడ్ అధికంగా లభిస్తుంది. ఇది గర్భిణీ స్త్రీ ఆరోగ్యానికే కాక కడుపులోని బిడ్డ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది.
జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది: పుట్టగొడుగులలో ఫైబర్ (Fiber) అధికంగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను (Digestive system) మెరుగుపరిచి తిన్న ఆహారం తేలికగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. దీంతో జీర్ణాశయ సమస్యలు తగ్గడంతో పాటు మలబద్దకం సమస్యలు కూడా తగ్గుతాయి.
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది: పుట్టగొడుగులలో పొటాషియం (Potassium) సమృద్ధిగా ఉంటుంది. ఇది గుండె కొట్టుకోవడాన్ని సాధారణ స్థితిలో ఉంచుతుంది. దీంతో గుండె ఆరోగ్యం (Heart health) మెరుగుపడటంతో పాటు అధిక రక్తపోటు సమస్యలు కూడా తగ్గుతాయి.
క్యాన్సర్ ను నివారిస్తాయి: పుట్టగొడుగులలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కారకాల (Carcinogens) పరిమాణాన్ని తగ్గించి వాటి వ్యాప్తిని అడ్డుకుంటాయి. అలాగే రొమ్ము క్యాన్సర్, పురుషులలో వచ్చే మూత్ర సంబంధిత క్యాన్సర్ వంటి వివిధ రకాల క్యాన్సర్లను (Cancer) నివారిస్తాయి.
అంతే కాకుండా వీటిని తీసుకుంటే చర్మ సమస్యలు (Skin problems), కంటి సమస్యలు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు (Arthritis) వంటి ఇతర సమస్యలు కూడా తగ్గుతాయి. చూసారా ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలిగిన పుట్టగొడుగులను తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.