Health Benefits Of raisins: ఎండద్రాక్షలను తినడం వల్ల లైంగిక సామర్థ్యం పెరుగుతుంది. వెయిట్ లాస్ అవుతారు. అంతేకాదు మీ కురులు నల్లగా మెరిసేందుకు కూడా ఇవి సహాయపడతాయి.
Health Benefits Of raisins: ద్రాక్ష పండ్లు ప్రపంచ వ్యాప్తంగా పండుతున్నాయి. ఈ పండ్లను ఎక్కువగా వైన్ తయారీలోనే వాడుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా పండే ద్రాక్ష పండ్లలో 60 శాతం పండ్లు ఆల్కహాల్ తయారీలోనే వాడుతున్నారని మీకు తెలుసా..
28
ఈ ద్రాక్షలను ఎండబెడితే ఎండు ద్రాక్షలు లేదా కిస్ మిస్ లు తయారవుతాయి. చాలా మందికి కిస్ మిస్ లను తినే అలవాటు ఉంటుంది. అయితే ద్రాక్ష పండ్లను తినడం వల్ల ఎన్ని ప్రయోజనాలున్నాయో.. కిస్ మిస్ లను తింటే కూడా అంతకంటే ఎక్కువ ప్రయోజనాలే ఉన్నాయి. అవేంటంటే..
38
ఈ కిస్ మిస్ లల్లో పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అంతేకాదు వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
48
ఎండు ద్రాక్ష లల్లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అలాగే మెగ్నీషియం, ఫాస్పరస్, ఖనిజ లవణాలు, ఐరన్, కాపర్ , మాంగనీస్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ మనల్ని ఎంతో బలంగా , ఆరోగ్యంగా ఉంచుతాయి.
58
స్పెర్మ్ కౌంట్, లైంగిక సామర్థ్యం పెంచడానికి ఈ ఎండు ద్రాక్షలు చక్కటి మెడిసిన్ లా పనిచేస్తాయి. పలు పరిశోధనల ప్రకారం.. వీటిని తరచుగా తింటే సంతానలేమి సమస్య తీరిపోయినట్టే.
68
అధిక బరువు నుంచి తొందరగా బయటపడేందుకు ఎండు ద్రాక్షలు బాగా ఉపయోగపడతాయి. అవును ఎండు ద్రాక్షలను తినడం వల్ల వెయిట్ లాస్ అవుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
78
చిన్నపిల్లలకు ఆహారంగా వీటిని ఇచ్చినట్టైతే వారి జీర్ణక్రియ బాగా పనిచేస్తుందట. దాంతో వారికి మలబద్దకం, అజీర్థి వంటి సమస్యలు రావని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
88
కిస్ మిస్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ నుంచి మనల్ని కాపాడుతాయి. చిన్నపిల్లలకు తరచుగా వచ్చే జ్వరాన్ని చాలా తొందరగా తగ్గిస్తాయి.