AC Plants: ఇంట్లో ఈ మొక్కలు ఉంటే AC లేకపోయినా పర్వాలేదు..ఇల్లంతా చల్లగా ఉంటుంది..!

Published : May 14, 2026, 01:17 PM IST

 AC Plants: మండే ఎండల్లో ఇంట్లో ఉండటం కూడా కష్టంగా మారింది. మరీ ముఖ్యంగా ఇంట్లో ఏసీ లేకపోతే కాసేపు కూడా ఉండలేని పరిస్థితిలో ఉన్నారా? అయితే, కొన్ని మొక్కలు పెంచితే ఏసీ లేకపోయినా ఇల్లు చల్లగా మారుతుంది... 

PREV
13
Plants

రోజు రోజుకీ ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలకు ఇంట్లో ఉండటం కూడా కష్టమే. అందుకే.. ప్రతి ఒక్కరూ కూలరు, ఏసీల మీద ఆధారపడుతూ ఉంటారు. ఏసీలు ఉన్నవారు అవి వేసుకుంటారు.. లేనివాళ్ల పరిస్థితి ఏంటి? అంతేకాదు.. ఏసీ ఉన్నవారైనా రోజులో 24 గంటలు ఆన్ చేసి ఉండలేరు... ఒకవేళ అలా ఉన్నా.. ఎక్కువ గంటలు ఏసీలో ఉండటం ఆరోగ్యానికి హానికరం... కరెంట్ బిల్లు కూడా పేలిపోతుంది. ఈ సమస్యలు ఏమీ లేకుండా.. మీ ఇంటిని చల్లగా మార్చుకోవాలా? ఈ మొక్కలు పెంచుకుంటే సరిపోతుంది...

కొన్ని మొక్కలు సహజ ఎయిర్ కండిషనర్లుగా పని చేస్తాయి. వాటిని వాస్తు ప్రకారం, సరైన దిశలో ఆ మొక్కలను ఇంట్లో ఉంచితే.. అవి ఇంటి ఉష్ణోగ్రతను తగ్గించడమే కాకుండా, ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. మరి ఆ మొక్కలేంటో చూద్దాం...

23
1.తులసి మొక్క...

ఇంటి లోపల సహజమైన చల్లదనాన్ని అందించడానికి తులసి ఒక అద్భుతమైన మొక్క. దీనిని ఎప్పుడూ ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల గాలి శుద్ధి అవ్వడమే కాకుండా.. రోజుకి 24 గంటలకు మంచి ఆక్సీజన్ ని అందిస్తుంది. వాతావరణం కూడా చల్లగా ఉంటుంది.

2.కలబంద..

కలబంద ఆక్సీజన్ అందించడంలో ముందు వరసలో ఉంటుంది. దీనిని ఇంటి తూర్పు లేదా ఉత్తర దిశలో నాటడం ఉత్తమం. ఇది గాలిలోని టాక్సిన్ తో పాటు.. గదిలోని వేడిని కూడా గ్రహిస్తుంది. గది చల్లపడుతుంది. రాత్రిపూట ఇంట్లో ఆక్సీజన్ ని విడుదల చేసి.. గదిని చల్లబరుస్తుంది..

33
3.స్నేక్ ప్లాంట్..

మీరు రాత్రిపూట ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోవాలంటే.. కచ్చితంగా స్నేక్ ప్లాంట్ పెంచాలి. దీనిని ఇంటి దక్షిణ లేదా తూర్పు దిశలో ఉంచాలి. ఇది కూడా ఇంటిని చల్లగా మారుస్తుంది. ఇంటికి శ్రేయస్సు కూడా లభిస్తుంది.

పుదీనా, కొత్తిమీర

ఆహ్లాదకరమైన అనుభూతి కోసం, మీ వంటగది కిటికీ దగ్గర లేదా ఉత్తర దిశలో పుదీనా మొక్కను నాటండి. దాని సువాసన మనసుకు ఉపశమనం కలిగిస్తుంది. ఈ మొక్క ఉష్ణోగ్రతను 1 నుండి 2 డిగ్రీల వరకు తగ్గిస్తుంది.

కొత్తిమీర లేదా ఇతర చిన్న మొక్కలను ఉత్తర దిశలో పెంచవచ్చు. వాటి పచ్చదనం కళ్ళకు ఆహ్లాదకరంగా ఉండటమే కాకుండా, ఇంట్లోని ఉష్ణోగ్రతను తగ్గించే శక్తిని కూడా కలిగి ఉంటుంది.

ఇంట్లో మొక్కలు పెంచడంతో పాటు.. చిన్న చిన్న మార్పులు కూడా చేసుకోవాలి. అప్పుడు ఇంటిని వేడి నుంచి రక్షించుకోవచ్చు. ఇంటికి ఉత్తరం లేదా ఈశాన్య దిశలో నీటితో నిండిన మట్టి కుండను ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇల్లు చల్లపడుతుంది. వేసవిలో కిటికీలకు తెలుపు లేదా లేత నీలం రంగు తెరలను వేలాడదీయండి, ఎందుకంటే ఇవి తక్కువ వేడిని గ్రహిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories