ఇవి చాలు డార్క్ సర్కిల్స్ పూర్తిగా పోవడానికి

First Published Jun 8, 2023, 2:56 PM IST

నిద్రలేమి, ఒత్తిడి,  మందు ఎక్కువగా తాగడం, స్మోకింగ్ వంటి కొన్ని కారణాల వల్ల డార్క్ సర్కిల్స్ వస్తాయి. ఈ డార్క్ సర్కిల్స్ వల్ల అందం తగ్గుతుంది. అయితే కొన్ని పోషకాలు ఈ సమస్యను దూరం చేస్తాయి. 
 

dark circles

కళ్ల చుట్టూ నల్లటి వలయాలు రావడం చాలా సహజం. అలా అని ఇవి అందరికీ రావు. నిద్రలేమి,  ఆల్కహాల్ ను ఎక్కువగా తాగడం, స్మోకింగ్, ఒత్తిడి వంటి సమస్యలు ఉన్నవారికే ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ డార్క్ సర్కిల్స్ ను నివారించడానికి పోషకాహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది.

dark circles

కళ్ల కింద నల్లటి వలయాలు విటమిన్స్, ఐరన్ లోపం వల్ల కూడా వస్తాయి. ఈ ముఖ్యమైన పోషకాలను మీ ఆహారంలో చేర్చడం వల్ల వీటిని వదిలించుకోవచ్చు. వీటిని తగ్గించుకోవడానికి ఎలాంటి పోషకాలు సహాయపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం..

vitamin c rich food

విటమిన్ సి

విటమిన్ సి డార్క్ సర్కిల్స్ ను వదిలించుకోవడానికి ఎంతో సహాయపడుతుందని నిపుణులు చెబుతన్నారు. నారింజ, నిమ్మకాయలు, ద్రాక్ష వంటి సిట్రస్ పండ్లు చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.

Image: Getty

లైకోపీన్

టమోటాలు లైకోపీన్ కు గొప్ప వనరు. ఉడకబెట్టిన టమోటాలు లేదా టొమాటో సాస్ తినడం వల్ల డార్క్ సర్కిల్స్ ను దూరం చేసుకోవచ్చు. పుచ్చకాయ, గులాబీ జామ, ఎండుమిర్చిలో కూడా లైకోపీన్ ఉంటుంది.
 

ఇనుము

బచ్చలికూర, మెంతి కూర వంటి ఆకు కూరల్లో ఇనుము పుష్కలంగా ఉంటుంది. కాయధాన్యాలు, బీన్స్, నువ్వులు, బెల్లం లో కూడా ఇనుము ఎక్కువ మొత్తంలో ఉంటుంది. శరీరంలో ఇనుము లేకపోవడం వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు తగ్గుతాయి. ఇది ఆర్బిసిలలో తగ్గుదలకు దారితీస్తుంది. 
 

విటమిన్ ఇ

బాదం, పొద్దుతిరుగుడు విత్తనాలు, వేరుశెనగ, అవిసె గింజలు విటమిన్ ఇ కి అద్భుతమైన వనరులు. విటమిన్ ఇ చర్మంలో శోథ నిరోధక ఏజెంట్ గా పరిగణించబడుతుంది. ఎందుకంటే విటమిన్ ఇ అతినీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని, తాపజనక నష్టాన్ని నివారించడానికి సహాయపడుతుంది.

విటమిన్ కె

బచ్చలికూర, కొత్తిమీర, పుదీనా ఆకులు వంటి ఆకుకూరల్లో విటమిన్ కె పుష్కలంగా ఉంటుంది. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మీ శరీరంలో విటమిన్ కె స్థాయిలు పెరుగుతాయి.

click me!