Knee Pain: మోకాళ్ల నొప్పులను తట్టుకోలేకపోతున్నారా? వీటిని తినండి వెంటనే తగ్గిపోతాయి..

Published : May 06, 2022, 10:37 AM ISTUpdated : May 06, 2022, 10:38 AM IST

Knee Pain: మోకాళ్ల నొప్పుల బాధను మాటల్లో చెప్పలేము. ఈ నొప్పుల వల్ల సరిగ్గా కూర్చోలేరు, నిలబడలేరు, ఆకరికి సరిగ్గా పడుకోలేరు కూడా. అయితే కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే మోకాళ్ల నొప్పులు తగ్గడమే కాదు వాపు కూడా పోతుంది.   

PREV
17
Knee Pain: మోకాళ్ల నొప్పులను తట్టుకోలేకపోతున్నారా?  వీటిని తినండి వెంటనే తగ్గిపోతాయి..

Knee Pain: ప్రస్తుత కాలంలో మోకాళ్ల నొప్పులు వయసుతో సంబంధం లేకుండా వస్తున్నాయి. కానీ సాధారణంగా ఈ మోకాళ్ల నొప్పులు 40 ఏండ్ల తర్వాతే వస్తాయి. మోకాళికి గాయం అయితే కూడా నొప్పి పుడుతుంది. అయితే ఈ మోకాళ్ల నొప్పులు మనం తీసుకునే ఆహారంలో పోషకాలు లేకుంటే కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే మీ రోజు వారి ఆహారంలో పోషకాహారం చేర్చుకోవడం ఎంతో అవసరం.

27

మోకాలి నొప్పి ఎందుకు వస్తుంది.. మీ శరీరంలో కాల్షియం లేదా ప్రోటీన్ లోపిస్తే మోకాలి నొప్పి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ నొప్పికి తోడు మోకాల్ల వాపు వస్తుంది. అయితే కొన్ని రకాల ఆహారాలు తీసుకుంటే మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.  అవేంటంటే.. 

37

ఆకుకూరలు.. ఆకుకూరలను తినడం వల్ల మీ శరీరంలో నొప్పిని కలిగించే ఎంజైములు తగ్గుతాయి. కాబట్టి మోకాళ్ల నొప్పులు ఉన్నవారు రెగ్యులర్ గా ఆకుకూరలనుు తింటూ ఉండాలి. అప్పుడే మీ ఎముకలు బలంగా తయారవుతాయి. అప్పుడు ఎలాంటి నొప్పులు రావు. 
 

47

గింజలు.. గింజలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమం తప్పకుండా తింటే మన శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు అందుతాయి. ఇవి ఎముకలను దృఢంగా చేస్తాయి. అంతేకాదు ఇవి మోకాలి నొప్పులను కూడా తగ్గిస్తాయి. 

57
turmeric and ginger

అల్లం, పసుపు.. అల్లం, పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. అందుకే వీటిని ఎన్నో ఏండ్లుగా ఔషధాలుగా ఉపయోగిస్తున్నారు. మోకాలి నొప్పితో బాధపడేవారు తమ రోజు వారి ఆహారంలో వీటిని తప్పకుండా చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.  అల్లం, పసుపు కలిపిన కషాయాన్ని తాగినా మంచి ఫలితం ఉంటుంది. 

67

పండ్లు.. కొన్ని రకాల పండ్లు మోకాలి నొప్పులను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. వీటిలో నారింజ, స్ట్రాబెర్రీలు, చెర్రీలు మోకాలి నొప్పిలను తగ్గించడంలో ముందుంటాయి. ఈ పండ్లలో విటమిన్ సి, లైకోపీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకల నొప్పిని తగ్గిస్తాయి. 
 

77

పాలు.. పాలు లేదా పాల ఉత్పత్తుల్లో విటమిన్ డి, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను బలంగా తయారుచేయడానికి ఎంతో సహాయపడాయి. ఎక్కువ కొవ్వు లేని పాలనే తీసుకోవడం మంచిది. అదే కొవ్వు ఎక్కువగా ఉండే పాలను తాగితే మాత్రం మీరు బరువు బాగా పెరిగిపోతారు. 

click me!

Recommended Stories