Health Tips: వాకింగ్ ఎంతసేపు చేస్తే మంచిది? నిపుణులు ఏం చెబుతున్నారు?

Published : Feb 26, 2022, 10:43 AM IST

Health Tips: ప్రతి రోజూ వాకింగ్ చేయాలని అందరికీ తెలుసు. మరి ఎంత సేపు చేయాలి? వాకింగ్ ఎంత సమయం చేస్తే మంచిదో చాలా వరకూ తెలియదు. నిర్ణీత సమయం చేస్తేనే శరీరం ఫిట్ గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  

PREV
110
Health Tips: వాకింగ్ ఎంతసేపు చేస్తే మంచిది? నిపుణులు ఏం చెబుతున్నారు?

Health Tips: శరీరం ఫిట్ గా ఉండాలన్నా, ఎలాంటి జబ్బుల పాలు కాకూడదన్నా.. ప్రతి రోజూ వాకింగ్ చేయడం తప్పనిసరి. అయితే వాకింగ్ ఎంత సేపు చేయాలి? ఎంత సేపు చేస్తే ఆరోగ్యానికి మంచిదన్నా విషయం చాలా మందికి తెలియదు. 

210

కొంతమందైతే ఫిట్ గా ఉంటామని సమయం  మర్చిపోయి వాకింక్ చేస్తూనే ఉంటారు. అలా చేయడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిన్నారు.
 

310

మనకు ఆకలేసినప్పుడు ఎంత ఆహారం తీసుకుంటాం.. పొట్ట నిండేంత వరకే కదా... అంతకు మించి తినలేము కదా.. ఈ పద్దతి వాకింగ్ కూడా వర్తిస్తుంది. 
 

410

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఒక్కోక్కరి శరీరం ఒక్కోలా ఉంటుంది. వారి శరీర తీరును బట్టే వాకింగ్ చేయాల్సి ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

510

ఆరోగ్యంగా ఉండే వాళ్లు నిత్యం కేవలం రెండు కిలోమీటర్లు నడిస్తే చాలని నిపుణులు చెబుతున్నారు. కాగా వీరు ఉదయం మార్నింగ్ 5 నుంచి 7 గంటల లోపు వాకింగ్ కంప్లీట్ చేస్తే ఆరోగ్యం  మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. 

610

అలా అలా వాకింగ్ చేయడం వల్ల స్వచ్ఛమైన గాలి అందుతుంది. దాంతో మనస్సు ప్రశాంతంగా మారుతుందని వైద్యులు పేర్కొంటున్నారు. 
 

710

వాకింగ్ చేస్తున్నప్పుడు ఆక్సిజన్ ఎక్కువగా పీల్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎక్కువ జనసంచారం లేని ప్లేస్ లో నే వాకింగ్ చేయండి. ఎందుకంటే జనాలు ఎక్కువగా ప్లేస్ లో విషవాయువులు శరీరంలో వెళ్తాయి. దీని మూలంగా మీరు అనారోగ్యం బారిన పడే ప్రమాదముంది.

810

అందులోనూ ఉదయం 8 గంటల లోపు వాకింగ్ చేసే వారికి విటమిన్ డి మంచిగా అందుతుంది. కాసేపు ఎండలో 10 నుంచి 15 నిమిషాలు ఎండలో ఉండండి. 
 

910

ఉదయం కుదరకపోతే సాయంత్రం 5 గంటల సమయంలో ఎండలో ఉన్నా..విటమిన్ డి లభిస్తుంది. అయితే వాకింగ్ అని మరీ నిదానంగా కూడా నడవకండి. బాడీ మొత్తం కదిలేలా నడిస్తేనే ఫలితం ఉంటుంది. దీనివల్ల మీరు చురుగ్గా ఉంటారు.
 

1010

ఇన్ని ప్రయోజనాలున్నవాకింగ్ ను నిర్లక్ష్యం చేయకండి. ఇతర కారణాల మూలంగా వాకింగ్ చేయడం కుదరపోతే .. ఇంట్లోనే అటూ ఇటూ నడవండి. ఒక రోజుకంటే ఎక్కువ రోజును వాకింగ్ చేయడాన్ని మానకండి. ఎందుకంటే వాకింగ్ వల్ల ఎన్నో జబ్బులు దూరమవుతాయి.   
 

Read more Photos on
click me!

Recommended Stories