Hearing Problem: ఈ అలవాట్లు మానుకోలేదే.. మీరు చెవిటి వాళ్లవడం ఖాయం..

Published : Apr 14, 2022, 03:46 PM IST

Hearing Problem: మన శరీర ముఖ్యమైన భాగాల్లో చెవులు ఒకటి. ఇతరులతో కమ్యూనికేట్ అవడానికి, ప్రమాదాన్ని పసిగట్టడానికి చెవులు ఎంతో ఉపయోగపడతాయి. కానీ కొన్ని అలవాట్ల వల్ల చెవులు దెబ్బతినే ప్రమాదం ఉంది. అంతేకాదు చెవుడు వచ్చే అవకాశం కూడా ఉంది. 

PREV
19
Hearing Problem: ఈ అలవాట్లు మానుకోలేదే.. మీరు చెవిటి వాళ్లవడం ఖాయం..

Hearing Problem: మన బాడీలో చెవులు ముఖ్యమైన భాగం. ఇవి బాగున్నప్పుడే మీరు ఇతరులతో ఈజీగా కమ్యూనికేట్ అవగలుగుతారు. వన్స్ ఇవి దెబ్బతిన్నాయో.. ఇతరులతో కమ్యూనికేట్ కావడానికి తంటాలు పడాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఇదివరకే వినికిడి సమస్యతో బాధపడుతున్నారా?  దగ్గరగా ఉన్నా ఇతరులతో గట్టి గట్టిగా మాట్లాడుతున్నారా? డౌటే లేదు ఈ లక్షణాలు మీకు చెవుడు వచ్చిందని తెలిపే సంకేతాలే. 

29

వినికిడి శక్తిని అంత తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే.. వినికిడి శక్తి బాగున్నప్పుడే మీరే ఈ ప్రపంచతంతో కనెక్ట్ అవుతారు. ఒకవేళ మీరు వినికిడి సమస్యతో బాధపడితే మాత్రం ఇతరులతో కమ్యూనికేట్ అవడం చాలా కష్టం. 

39
hearing loss

ఒకప్పుడు వయసు మీద పడుతున్నవారిలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపించేది. ఇప్పుడు మాత్రం అలా లేదు. చిన్న వయసువారు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. వీటికి కారణాలు చాలా ఉన్నాయి. కొన్ని రకాల చెడు అలవాట్ల వల్ల ఈ సమస్య తలెత్తుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ సమస్యను నివారించాలంటే ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 

49
hearing loss

వినికిడి లోపం లక్షణాలు.. వినికిడి లోపం సమస్యతో బాధపడుతున్న ఉన్నవారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. అవేంటో తెలసుకుంటే.. ఈ సమస్య ముదరకుండా జాగ్రత్త పడొచ్చు. అవేంటో ఇపుుడు తెలుసుకుందాం. 

1. ఎక్కువ సౌండ్ పెట్టుకుని టీవీని చూస్తుండటం. 

2.  ఫోన్లో లేదా రేడియోల్లో చాలా సౌండ్ పెట్టుకుని పాటలు వినడం

3. ఇతరులతో చాలా గట్టి గట్టిగా మాట్లాడం, వారి మాటలను అర్థం చేసుకోలేకపోవడం

4. ఫోన్ల కాల్ లో గట్టి గట్టిగా మాట్లాడటం, సరిగ్గా వినకపోవడం వంటి లక్షణాలు మీరు వినికిడి లోపంతో బాధపడుతున్నట్టు తెలుపుతాయి. 

ఈ రెండు అలవాట్ల వల్లే చెవుడు వచ్చేలా చేస్తాయి..
 

59
hearing loss

వయసు మీద పడుతున్న వారికే వినికిడి లోపం వచ్చేది. అది కూడా 60 ఏండ్లు పైబడిన వారికే ఎక్కువగా వచ్చేది. . ఇప్పుడు వయసుకు సంబంధం లేకుండా ఈ సమస్య బారిన పడుతున్నారు. ఇలా చిన్న వయసులోనే చెవులు వినిపించకపోవడానికి వారు చేసే తప్పులే కారణం. అవేంటంటే.. 

69

చెవులను తడిగా ఉంచడం.. చెవులను తడిగా ఉంచడం ఏ మాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే చెవులు తడిగా ఉండటం వల్ల చెవి Fungal Infection సమస్య బారిన పడుతుంది. ఈ ప్రాబ్లం స్విమ్ చేసే వాళ్లలోనే ఎక్కువగా వస్తుంటుంది. చెవిలో తేమ ఎక్కవగా ఉండటం వల్ల ఈ ఇన్ఫెక్షన్ కారణమయ్యే కాండిడా, ఆస్పెర్గిల్లస్ అని పిలువబడే బ్యాక్టీరియా కు వేగంగా వ్యాప్తి చెందుతుంది. 

79

సౌండ్ ఎక్కువగా పెట్టుకుని పాటలు వినడం..  పాటలను ఎక్కువ సౌండ్ పెట్టుకుని వినడం ఇష్టమా..? అయితే వెంటనే అ అలవాటును మానుకోండి. ఎందుకంటే సౌండ్ ఎక్కువగా పెట్టుకుని వినడం వల్ల చెవులు దెబ్బతింటాయి. అదికాస్త వినికిడి లోపం ఏర్పడే దాకా వెలుతుంది. 

89

వినికిడి లోపానికి ఇవి కూడా కారణాలే..

1. జన్యుపరంగా కూడా ఈ వినికిడి సమస్య రావొచ్చు

2. చెవిపోటు తో కూడా ఈ సమస్య వస్తుంది

3. మీరు పనిచేసే చోట చాలా శబ్దం రావడం

99

నివారణా చిట్కాలు

1. చెవిలో పిన్నీసులను, ఇయర్ బడ్ లను పదే పదే పెట్టకూడదు

2. ఇకపోతే స్నానం చేస్తున్నప్పుడు చెవిలో నీళ్లను ఎక్కువగా పోసుకోకూడదు

3. ఫోన్లో కానీ  టీవీలో కానీ పాటలను ఎక్కువ సౌండ్ పెట్టుకుని వినకూడదు

4. మీరు పనిచేసే చోట ఎక్కువ శబ్దం వస్తున్నట్టైతే చెవుల్లో దూదిని పెట్టుకుని పనిచేయండి
  

click me!

Recommended Stories