భూమి మీద మానవులకు అత్యంత ప్రమాదకరమైన టాప్-7 జీవులు ఇవే

First Published | Sep 1, 2024, 12:26 PM IST

7 Most Dangerous Creatures on Earth: అత్యంత ప్రమాదకరమైన జంతువుల గురించి ఆలోచించినప్పుడు సాధారణంగా పులులు, పాములు, మొసళ్ళు వంటి పేర్లు వెంటనే గుర్తుకు వస్తాయి. అయితే, భూమి మీద వీటికంటే మరిన్ని ప్రమాదకరమైన జీవులు కూడా ఉన్నాయి. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. 

7 Most Dangerous Creatures on Earth

భూమిపై అత్యంత ప్రమాదకరమైన జీవులు: 

భూమి మీద అత్యంత ప్రమాదకరమైన జీవులు చాలా ఉన్నాయి. అయితే, ఎవరినైనా ఈ ప్రశ్న అడిగినప్పుడు టక్కున వినిపించే సమాధానం అడవి సింహాలు, విషపూరిత పాములు, సొరచేపల పేర్లు ముందు వినిపిస్తుంటాయి. ఎందుకంటే ఈ జీవులను సినిమాల్లో తరచుగా భయంకరంగా చిత్రీకరిస్తారు. అవి మానవులకు అతిపెద్ద ముప్పును కలిగిస్తాయని మనం నమ్ముతాము.

అయితే, వీటి కంటే మరికొన్ని జీవులు మానవ జీవితానికి చాలా ఎక్కువ ప్రమాదం కలిగిస్తాయి. మీరు వీటిని పెద్దవిగా, గంభీరమైనవిగా ఊహించుకోవచ్చు. కానీ, అవి అలాంటి కావు.. అవి ఆశ్చర్యకరంగా చిన్నవిగా ఉంటే జీవులు. ఈ భూమి మీద భయంకరమైన, ప్రమాదకరమైన జీవులుగా ఉన్నాయి. వాటిలో.. 

దోమల ముప్పు

దోమలు : 

దోమలు అనగానే మీకు ఇదేంటి అని చాలా సింపుల్ గా అనిపించవచ్చు కానీ, ఈ భూమిపై మానవులకు అత్యంత ప్రమాదకరమైన జీవులలో దోమలు మొదటి స్థానంలో ఉన్నాయి. ఎందుకంటే భూమి మీద ఉన్న అన్ని జీవులు కంటే దోమల వల్లనే ఎక్కువ మంది మరణిస్తున్నారని పలు రిపోర్టులు, నిపుణులు భావిస్తున్నారు.

డెంగ్యూ జ్వరం, మలేరియా, జికా వైరస్, ఎల్లో ఫీవర్ వంటి వ్యాధులను దోమలు వ్యాపింపజేస్తాయి. దోమల ద్వారా వచ్చే వ్యాధుల వల్ల ఏటా 7 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు సర్వేలు వెల్లడిస్తున్నాయి. వాటి చిన్న పరిమాణం ఉన్నప్పటికీ, దోమలు ప్రాణాంతక వ్యాధులను వ్యాపింపజేస్తాయి.

ప్రతియేటా లక్షలాది మంది ప్రాణాలు పోవడానికి కారణం అవుతున్నాయి. అందుకే దోమలు భూమిపై మానవులకు అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో మొదటి స్థానంలో ఉన్నాయి. 


మనుషులే మనుషులకు ప్రమాదకరమైన జీవుల:

భూమిపై మనుషులకు అత్యంత ప్రమాదకరమైన జీవుల జాబితో మానవులు రెండో స్థానంలో ఉన్నారు. మానవులు మానవులను ఎలా హాని చేయగలరని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ అది నిజం. దొంగతనం, యుద్ధం, పోరాటం, హత్య వంటి అనేక సందర్భాల్లో మానవులు ఒకరినొకరు క్రూరంగా చంపుకుంటున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.

వీటిని మీరు ప్రతిరోజూ వార్తల్లో చూస్తారు. ఇలాంటి సంఘటనల వల్ల ఏటా 4 లక్షల మంది మరణిస్తున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకే జాతికి చెందిన చెందిన జీవుల మధ్య జరుగుతున్న ఘర్షణలో అత్యంత ప్రమాదకరమైన జీవులగా మనుషులు కూడా భూమిపై ఉన్నారు. 

పాములు : 

భూమిపై అత్యంత ప్రమాదకరమైన జీవులలో పాములు కూడా ఉన్నాయి. అవి మానవ జీవితాన్ని కూడా సులభంగా ముగించగలవు. వీటి విషం కారణంగా అనేక మంది చనిపోతున్నారు. పాము కాటు వల్ల ఏటా ఒక లక్ష మంది మరణిస్తున్నారని రిపోర్టులు పేర్కొంటున్నాయి. అందుకే ప్రజలు పాములంటే చాలా భయపడతారు. 

భూమిపై పాములు అనేక రకాలు ఉన్నాయి. ఒక్కోపాము ఒక్కోరకమైన ప్రభావం చూపుతూ మనుషుల ప్రాణాలు తీసుకుంటున్నాయి. ఒక పాము విషం క్షణాల్లో ప్రాణాలు తీస్తే.. మరో రకమైన పాము విషం కొన్ని రోజుల వరకు మనిషిని తీవ్రంగా బాధకు గురి చేసి ప్రాణాలు తీస్తుంది. 

ఇన్లాండ్ తైపాన్, పాన్, కింగ్ కోబ్రా,  బ్లాక్ మాంబా వంటి పాము జాతుల విషం చాలా శక్తివంతమైనది, ఇది కొన్ని గంటల్లోనే ఒక వ్యక్తిని చంపగలదు. పాము జాతుల్లో పైథాన్లు 10 మీటర్ల పొడవు వరకు పెరుగుతాయి. మానవుడిని సులభంగా మింగగలవు.

అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అందుకే అవి మానవులకు ప్రమాదకరమైనవిగా పరిగణించబడుతున్నాయి. ఈ పైథాన్లు దొంగతనంగా దాడిస్తాయి. రంగులు మార్చుకునే కొన్ని జాతుల వల్ల అడవుల్లో వాటిని గుర్తించడం చాలా కష్టం.

కుక్కలు : 

కుక్కల పేరు వినగానే మీకు ఆశ్చర్యం కలగవచ్చు. మనుషులకు చాలా తొందరగా దగ్గరయ్యే కుక్కలు ఎందుకు మనుషులకు అత్యంత ప్రమాదకరమై జీవులు అనే ప్రశ్నలు కూడా మీకు ఇప్పటికే వచ్చి వుండవచ్చు. కానీ, ఇది నిజం. 

కుక్కలు నమ్మకాన్ని చూపించడంలో ముందుంటాయి. అందుకే కుక్కలను మానవులకు అత్యంత నమ్మకమైన సహచరులు అంటారు. కానీ కొన్నిసార్లు, అవి చాలా ప్రమాదకరంగా కూడా ఉంటాయి. కుక్కల లాలాజలం వల్ల రేబిస్ వస్తుంది.

రెబిస్ కు చికిత్స చేయకుండా వదిలేస్తే ఈ వ్యాధి ప్రాణాంతకం కావచ్చు. కుక్క కాటు వల్ల ఈ వ్యాధి వస్తుంది. అయితే, కుక్క కాటు వల్ల ఏటా 59 వేల మంది మరణిస్తున్నారని రిపోర్టుల సమాచారం. అలాగే, కుక్కల్లో కూడా మనుషులపై అత్యంత క్రూరంగా దాడి చేసే రకాలు ఉన్నాయి. 

ఇంత చిన్న నత్తలు మనుషులను చంపగలవని మీరు నమ్ముతారా? మీరు నమ్మినా.. నమ్మకపోయినా ఇది నిజం. నత్తలు మనుషులను చంపగల జీవులు. మంచినీటిలో కనిపించే ఈ నత్తల వల్ల ఏటా దాదాపు 12 వేల మంది మరణిస్తున్నారని సమాచారం. స్కిస్టోసోమియాసిస్ అనే పరాజీవి నత్తలు చాలా ప్రమాదకరమైనవి. వాటి లాలాజలంతో దాడి చేస్తాయి. కొన్ని సందర్భాల్లో నత్తలు విపరీతమైన ప్రమాదాన్ని కలిగిస్తాయి. ప్రాణాలను కూడా తీస్తాయి.

కొన్ని రకాల నత్తలు (ఉదాహరణకు, కాలమణి నత్త) కుట్టినప్పుడు తీవ్రమైన దుర్గంధం వస్తుంది. దీనికారణంగా మనుషులకు ఇన్ఫెక్షన్ అవకాశాలు అధికంగా ఉంటాయి. కొన్ని రకాల నత్తలు విషతత్వం వల్ల అలెర్జీ ప్రభావాలను కలిగిస్తాయి. అంటే అవి కుట్టిన స్థలంలో ఎర్రగా మారి పుండుగా కావడం, దురద, లేదా ఇతర అనారోగ్య సమస్యలు కలిగిస్తాయి. 

నత్తలు కుట్టిన స్థలంలో బ్యాక్టీరియా వ్యాప్తితో  ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ. చిన్న పిల్లలు నత్తలను టచ్ చేయడం లేదా వాటిని పట్టుకోవడం వల్ల తీవ్ర ప్రమాదానికి గురవవచ్చు. ఒక్కోసారి వారి ప్రాణాలకు కూడా ముప్పు పరిస్థితులు ఏర్పడతాయి.

మానవులకు అత్యంత ప్రమాదకరమైన జీవుల్లో తేళ్లు కూడా ఉన్నాయి. తేళ్లను కూడా తేలికగా తీసుకోకూడదు. అవి కూడా చాలా ప్రమాదకరమైన జీవులు. తేళ్ల వల్ల ఏటా దాదాపు మూడు వేల మందికి పైగా మరణిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. 

25 జాతుల తేళ్లు ప్రాణాంతకమని నిపుణులు చెబుతున్నారు. ఉత్తర అమెరికా, మధ్యప్రాచ్యంలో కనిపించే తేళ్లు చాలా ప్రమాదకరమని నిపుణులు పేర్కొంటున్నారు. తేళ్లలో చాలా రకాలు ఉన్నాయి. వివిధ ప్రాంతాల్లో వివిధ రకాల తేళ్లను మనం చూడవచ్చు. 

వాటిలో కొండ ప్రాంతాల్లో కనిపించే తేళ్లు చాలా విషపూరితమైనవి. ఇవి కుట్టడం వల్ల మనుషులు ప్రాణాలు కోల్పోయే ప్రమాదం అధికంగా ఉంటుంది. అరెన్స్టోనా రకం తేలు చాలా ప్రమాదకరమైనవి. ఇది అత్యంత విషపూరితమైన స్కార్పియన్స్ లో ఒకటి.

అరెన్స్టోనా రకం తేలు కుట్టిన వ్యక్తికి తీవ్రమైన నొప్పి, పేగులకీ, శ్వాస సమస్యలు, కనుపాపలపై తీవ్ర ప్రభావం చూపడంతో పాలు పలు సందర్భాల్లో అనిమియాకు దారితీస్తుంది. దీని వల్ల ప్రాణాలు కోల్పోవచ్చు. 

Latest Videos

click me!