జస్ట్ 10 నిమిషాలు.. చెప్పులు లేకుండా గడ్డిపై నడిస్తే ఏమౌతుందో తెలుసా?

First Published Sep 1, 2024, 11:49 AM IST

చాలా మంది ఇంట్లో నుంచి ఆరుబయటకు వచ్చినా చెప్పులను ఖచ్చితంగా వేసుకుంటుంటారు. నిజానికి చెప్పులు లేకుండా నడిస్తేనే మంచిది. అందులో మీరు గడ్డిపై ఒక పది నిమిషాలు నడిస్తే బోలెడు లాభాలను పొందుతారు. అవేంటంటే?

ఉదయపు వాకింగ్ మనల్ని ఎంతో ఆరోగ్యంగా ఉంచుతుంది. వాకింగ్ చేయడం వల్ల మీరు బరువు తగ్గడమే కాకుండా..మీరు ఫిట్ గా కూడా ఉంటారు. వాకింగ్ మన శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే  వాకింగ్ కాకుండా.. మీరు జస్ట్ ఒక పది నిమిషాల పాటు చెప్పులు లేకుండా గడ్డిపై నడిస్తే కూడా ఎంతో మంచిది. చెప్పులు లేకుండా నడవడం మొదట్లో కాస్త ఇబ్బందిగా అయినా.. ఇది మీకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. అలాగే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఆడవాళ్లు చెప్పులు లేకుండా గడ్డిపై 10 నిమిషాలు నడవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం పదండి. 

నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే?

ప్రస్తుత కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య వల్ల మీరు ఊబకాయం బారిన పడటమే కాకుండా.. ఎన్నో ప్రమాదకరమైన రోగాలు కూడా వస్తాయి. అందుకే దీన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలి. అయితే మీకు నిద్రలేమి సమస్య ఉన్నట్టైతే ప్రతిరోజూ కొద్ది సేపు చెప్పులు వేసుకోకుండా గడ్డిపై నడవడం అలవాటు చేసుకోండి. దీనివల్ల మీరు రాత్రిళ్లు ప్రశాంతంగా నిద్రపోతారు. 

పీరియడ్స్ కడుపు నొప్పి తగ్గాలంటే? 

ఈ పీరియడ్స్ అందరి ఆడవాళ్లపై ఒకే రకమైన ప్రభావాన్ని చూపవు. అయితే కొంతమందికి మాత్రం పీరియడ్స్ లో తట్టుకోలేనంత కడుపు నొప్పి, తిమ్మిరి, మూడ్ స్వింగ్స్, తలనొప్పి, చేతులు, కాళ్లు లాగడం మొదలైన ఎన్నో సమస్యలు వస్తుంటాయి. అయితే మీరు ఈ సమయంలో కొద్దిసేపు గడ్డిలో చెప్పులు లేకుండా నడిస్తే ఈ సమస్య తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
 

Latest Videos


హార్మోన్ల సమస్యలు తగ్గాలంటే? 

ఆడవారిలో హార్మోన్ల అసమతుల్యత సమస్య ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మీరు ఎన్నో శారీరక, మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇలాంటి పరిస్థితిలో గడ్డిపై చెప్పులు లేకుండా ఒక 10 నిమిషాల పాటు నడిస్తే ఈ సమస్యల నుంచి కొంత ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే? 

ఎప్పుడూ ఫోన్, ల్యాప్ టాప్ చూడటం వల్ల కళ్లపై ఒత్తిడి పెరుగుతుంది. కంటిచూపు కూడా దెబ్బతింటుంది. అయితే మీరు గడ్డిపై చెప్పులు లేకుండా నడవడం వల్ల కూడా మీ కళ్లకు ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మన పాదాలపై ఒక ప్రెజర్ పాయింట్ ఉంటుంది. అది మన కళ్ల నరాలతో అనుసంధానించబడి ఉంటుంది. చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఈ ప్రెజర్ పాయింట్ ఉత్తేజితమై కళ్లకు ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది. 

నొప్పి, వాపు తగ్గాలంటే? 

ఏవైనా గాయాలు అయితే అక్కడ విపరీతమైన నొప్పి, వాపు వంటి సమస్యలు ఉంటాయి. ఇవి చాలా నెమ్మదిగా తగ్గుతాయి. ఇలాంటి సమయంలో మీరు రోజూ కొద్దిసేపు చెప్పులు వేసుకోకుండా గడ్డిపై నడిస్తే ఈ సమస్యలు తొందరగా తగ్గిపోతాయి. దీనివల్ల మీ శరీరంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే నొప్పి, వాపు నుంచి ఉపశమనం కలుగుతుంది. 

బీపీ తగ్గాలంటే? 

రక్తపోటును తగ్గించుకోవడానికి రకరకాల మందును వాడుతుంటారు. ఎన్నో ఆహారాలకు దూరంగా ఉంటారు. వీటితో పాటుగా మీరు చెప్పులు వేసుకోకుండా.. గడ్డిపై నడిచినా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అవును చెప్పులు లేకుండా నడిచినప్పుడు ఒత్తిడి స్థాయి తగ్గుతుంది. ఇది మీ రక్తపోటును క్రమంగా నియంత్రించడానికి సహాయపడుతుంది. 

రోగనిరోధక శక్తి పెరగాలంటే? 

రోగనిరోధక శక్తి ఎంత ఎక్కువగా ఉంటే.. మీరు అంత హెల్తీగా, ఎలాంటి రోగాలు లేకుండా ఉంటారు.అయితే మీరు చెప్పులు లేకుండా గడ్డిపై నడవడం వల్ల కూడా మీ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఈ అలవాటు వల్ల  నాడీ వ్యవస్థ ఉద్దీపన మెరుగుపడుతుంది. దీంతో ఒక వ్యక్తికి శరీరానికి సంబంధించిన సమస్యలతో పోరాడే శక్తి లభిస్తుంది.
 

click me!