Heart Attack: హార్ట్ పేషెంట్లు తప్పకుండా తినాల్సిన పండ్లు ఇవే..!

First Published May 16, 2022, 11:34 AM IST

Heart Attack: హార్ట్ ఎటాక్ పేషెంట్లు కొన్ని రకాల పండ్లను ఖచ్చితంగా తినాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ఈ పండ్లు కొలెస్ట్రాల్ ను సమతుల్యంగా ఉంచుతాయి. 

ప్రస్తుత కాలంలో హార్ట్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. గుండెకు సంబంధించిన రోగాలతో బాధపడేవారు తమ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక సారి గుండెపోటు వస్తే అది మళ్లీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు తమ ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది.

హార్ట్ పేషెంట్స్ ఎక్కువగా తాజా పండ్లను, కూరగాయలను తీసుకుటే వీరి ఆరోగ్యానికి ఏ ప్రమాదం ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఇవి ఒంట్లో కొలెస్ట్రాల్ స్థాయిని కూడా సమతుల్యంగా ఉంచుతాయి. ఇంతకీ డైట్ లో ఎలాంటివి తీసుకోవాలో తెలుసుకుందాం పదండి.. 
 

బెర్రీలు (berries).. ఇప్పటికే గుండెపోటుకు గురైన వారు క్రమం తప్పకుండా బెర్రీలను తమ ఆహారంలో చేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి గుండెను సురక్షితంగా ఉంచుతాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ మొత్తాన్ని కూడా తగ్గిస్తాయి. దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఒత్తిడిని తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. 
 

రాస్బెర్రీ Raspberries).. బెర్రీలే కాకుండా రస్పెర్రీలు కూడా గుండెకు ప్రయోజనకరంగా ఉంటాయి.  చాలా చిన్నగా కనిపించే ఈ పండ్లు నోట్లో వేసుకోగానే ఫాస్ట్ గా కరిగిపోతాయి. నిజానికి వీటిని తినడం వల్ల గుండెకు రక్తాన్ని చేర్చే సిరలు ఫిట్ గా,ఆరోగ్యంగా ఉంటాయి.  ఇవి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని ఓ పరిశోధనలో వెల్లడైంది. 

ద్రాక్షపండ్లు.. గుండెకు ద్రాక్ష పండ్లు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. ద్రాక్షపండులో పెద్ద మొత్తంలో పాలీఫెనాల్స్, ఫినోలిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇవి మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను నియంత్రించడానికి ఎంతో సహాయపడతాయి. ఈ పండులో యాంటీ ఆన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. 

ఆపిల్స్.. హార్ట్ం పేషెంట్లు తమ రోజు వారి ఆహారంలో ఆపిల్స్ ను కూడా చేర్చుకోవచ్చు. ఆపిల్ పండ్లలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రణలో ఉంచే గుణాలు ఉన్నాయి. ఇది హార్ట్ పేషెంట్లకు దివ్య ఔషదమే అంటారు వైద్యులు, ఆరోగ్య నిపుణులు. హైబీపీ లేదా గుండెలో అడ్డంకి వంటి సమస్యలు ఉన్నవారు ప్రతిరోజూ ఒక ఆపిల్ పండును ఖచ్చితంగా తినాలంటున్నారు నిపుణులు. 
 

click me!