స్నానం చేసేప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటే.. అందమైన జుట్టు, ఆరోగ్యవంతమైన చర్మం మీ సొంతం..

First Published Feb 24, 2021, 3:07 PM IST

స్నానం చేయడం విషయంలో ప్రతి ఒక్కరికీ తమదైన అభిప్రాయం ఉంటుంది. కొంతమంది పొద్దు పొడవకముందే స్నానం చేస్తే, మరికొందరు సాయంత్రాలు చేస్తారు. ఇంకొందరు రోజుకు ఒకసారి స్నానం చేస్తే, కొందరు పొద్దున, సాయంత్రం రెండు పూటలా తప్పనిసరిగా స్నానం చేస్తారు.

undefined
ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం అని తేడా లేకుండా ఈ అలవాట్లు కొనసాగుతుంటాయి. అయితే ఎవరికి ఎలా నచ్చితే అలా స్నానం చేయచ్చు. దీనిమీద పెద్దగా చర్చించాల్సింది ఏమీ లేదు. ఒళ్లు శుభ్రంగా ఉండడమే ముఖ్యం. అయితే స్నానం ఎలా చేస్తున్నారనేదే ముఖ్యం.
undefined
ఎలా అంటే స్నానం వల్ల చర్మం, జుట్టు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంటుంది. ఎక్కువ వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మం మీది నూనెలు కోల్పోతాయి, అలాగే జుట్టు నిర్జీవంగా తయారవుతుంది. అలా కాకుండా ఉండాలంటే కొన్ని బాతింగ్ టిప్స్ తెలిసి ఉండాలి. దీనివల్ల చర్మం, జుట్టు దెబ్బతినకుండా ఉంటుంది.
undefined
చాలామందికి అధిక వేడి లేదా అధిక చల్లటి నీటితో స్నానం చేసే అలవాటుంటుంది. దీనివల్ల చర్మం, జుట్టులోని సహజమైన నూనెలు తగ్గిపోతాయి. జుట్టు, చర్మం తేమను కోల్పోయి పొడి బారిపోతాయి.
undefined
తల స్నానం చేసేప్పుడు జుట్టును బాగా రుద్దుతారు. అలా చేయడం వల్ల జుట్టు ఊడిపోవడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అందుకే వీలైనంత సున్నితంగా జుట్టును రుద్దుకోవాలి.
undefined
షాంపూతో తలస్నానం చేసిన తరువాత కండీషనర్ వాడకపోతే జుట్టు పొడిబారి నిర్జీవంగా తయారవుతుంది. షాంపూలోని అధిక ఘాడత జుట్టులోని తేమను తగ్గిస్తుంది. కండీషనర్ ఆ నష్టాన్ని పూడుస్తుంది. దీంతో జుట్టు మళ్లీ అందంగా కనిపిస్తుంది.
undefined
బైటి దుమ్ము, దూళీ, కాలుష్యం, వేడి జుట్టుకు ప్రధాన శత్రువులు. అందుకే రెగ్యులర్ గా తలస్నానం చేయాలి. మంచి హెయిర్ కేర్ ప్రాడక్ట్స్ వాడాలి. జుట్టు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
undefined
ముఖానికి సబ్బు రాసుకోవడం మర్చిపోవద్దు. అయితే మరీ గట్టిగా రాయడం వల్ల సబ్బు ముఖం మీది pH స్థాయిని నాశనం చేస్తుంది. దీనివల్ల చర్మ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
undefined
ఇక స్నానానికి ముందు వేడి నూనెతో మసాజ్ చేసుకోవడం చాలా మంచిది. దీనివల్ల స్నానం వల్ల శరీరం కాంతి కోల్పోకుండా ఉంటుంది. అంతేకాదు శరీరంలోని మృత కణాలు తొలగిస్తుంది, మీ చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది.
undefined
ముఖం మీద పేరుకుపోయిన జిడ్డును, దుమ్మును తొలగించడానికి ముఖాన్ని రోజుకు రెండు సార్లు మాత్రమే సబ్బును ఉపయోగించి కడగాలి. కొంతమంది పదే పదే ముఖం కడుగుతుంటారు. ఇది అంత మంచి అలవాటు కాదు. సబ్బును ఎక్కవగా వాడడం వల్ల ముఖం మీది జిడ్డుతో పాటు చర్మం కూడా దెబ్బతింటుంది.

సబ్బు, షాంపూలు వాడిన తరువాత శరీరాన్ని, జుట్టును నీటితో బాగా కడగాలి. శరీరం మీద సబ్బు అవశేషాలు, జుట్టులో షాంపూ అవశేషాలు లేకుండా చూసుకోవాలి. లేకపోతే చుండ్రు, మొటిమల సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
undefined
click me!