యుక్తవయసు రాగానే శరీరంలో ఓ వింత పులకరింత మొదలవుతుంది. ఇష్టమైన వ్యక్తులు తారసడ్డప్పుడు పొటల్లో సీతాకోక చిలుకల సవ్వడి ఎక్కువవుతుంది. ఇక ప్రేమలో పడితే ఈ గిలిగింతకు అడ్డు, అదుపు ఉండదు. మనసుకు నచ్చిన వ్యక్తి సాంగత్యం కొత్త లోకాల్లో విహరించేలా చేస్తుంది.
అదొక అందమైన అనుభూతి, మాటల్లో చెప్పలేని వింత భావన. అయితే శరీరం ఎంత పులకరించినా, కోరికలతో పలవరించినా మొదటిసారి శృంగారంలో పాల్గొనడానికి చాలామంది మహిళలు అంత తొందరగా ఇష్టపడరు. ముఖ్యంగా పెళ్లికి ముందు శృంగారం అనేది ఇంకా మనదేశంలో ఎక్కువగా లేదు.
అందుకే పెళ్లి తరువాతే దానికి సిద్దమవుతుంటారు. అయితే మీరు డేటింగ్ లో ఉన్నా, పెళ్లైనా, సహజీవనంలో ఉన్నా ముఖ్యంగా స్త్రీలు మొదటి సారి శృంగారంలో పాల్గొనేముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొన్నింటికి సిద్ధపడాలి అప్పుడే శృంగారపు లోతుల్ని చూడగలుగుతారు.
భాగస్వామి మీద ఎంత నమ్మకం, ప్రేమ, అభిమానం, ఇష్టం ఉన్నా మొదటిసారి సెక్స్ అనగానే టెన్షన్ పడతారు. ఒత్తిడికి గురవుతారు. ఆ ఒత్తిడిని తగ్గించి మీ మనసును తద్వారా శరీరాన్ని రతి క్రీడకు సిద్ధం చేసుకోవడానికి కొన్ని చిట్కాలు ఇవి...
అమలిన శృంగారానికి వెజైనాలో లూబ్రికెంట్స్ చాలా ముఖ్యం. దీని ద్వారా సంభోగం సమయంలో నొప్పి తగ్గుతుంది.. రతిక్రీడ సులభమవుతుంది.
మొదటిసారి శృంగారంలో పాల్గొంటున్నప్పుడు శరీరంలో ఎంత తొందర ఉన్నా, ఎంత కోరిక ఉన్నా లూబ్రికెంట్స్ ఎక్కువగా విడుదల కావు. ఇది తెలిసి ఉండాలి.
అందుకే సెక్స్ లో పాల్గొనాలనుకున్నప్పుడు చాలా సేపు ఫోర్ ప్లే చేయాలి. ఆ తరువాత అసలు పనిలోకి దిగాలి. లేదా వాటర్ బేస్డ్ లూంబ్రికెంట్స్ వాడడం మంచిది. దీనివల్ల యోనిలోకి అంగం ప్రవేశించడం సులభమవుతుంది. చాలా కండోమ్స్ పై భాగం జిడ్డుగా ఉండడానికి కారణం ఇదే.

మొదటి సారి శృంగారం అంటే నొప్పికి సిద్ధంగా ఉండాలి. ఖచ్చితంగా ప్రతీ స్త్రీ తన మొదటి సంభోగంలో నొప్పిని అనుభవిస్తుంది. అయితే నొప్పి ఉంటుందనే భావనతో శృంగారానికి దూరంగా ఉండడం సరికాదు.
ఆ నొప్పి కొన్ని సెకన్లు మాత్రమే ఆ తరువాత కలిగే రసాస్వాదన తో మీరు మళ్లీ మళ్లీ శృంగారం కావాలనుకుంటారు.
మొదటి సారి సంభోగంలో రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగని అందరి విషయంలో ఇది జరగుతుందని చెప్పలేం. హైమెన్ పొర చిరిగి పోవడం వల్ల ఇలా జరుగుతుంది.
అయితే కొంతమందిలో ఇది చిన్నతనంలో ఆడుకునేప్పుడే చిరిగిపోయే అవకాశాలుంటాయి కాబట్టి ప్రతీ స్త్రీకి మొదటి సంభోగంలో రక్తం కనబడుతుంది అనేది నిజం కాదు.
కొంతమందికి మనసులో ఎంతో కోరికగా ఉన్నా అంత తొందరగా ఉద్వేగానికి లోను కారు. దీంతో అంత తృప్తిగా సెక్స్ లో పాల్గొనలేరు. అయితే మీరు ఉద్వేగాలకు లోనుకాకపోవడం అనేది పెద్ద విషయంగా పట్టించుకోకండి. మొదటి సారి శృంగారంలో పాల్గొంటున్నాం అనేదానిమీదే దృష్టి పెట్టండి.

మొదటి అనుభవం తరువాత ఆ భావన మీలో పుట్టించే ఉద్వేగాలు, ఉద్రేకాలు మిమ్మల్ని మరో లోకానికి తీసుకెడతాయి. అందుకే మొదటి సంభోగం మీద ఎక్కువ అంచనాలు పెట్టుకోవద్దు.
కొంతమంది స్త్రీలలో మొదటిసారి సెక్స్ లో పాల్గొన్న తరువాత కొద్ది రోజుల వరకు రక్తస్రావం జరుగుతుంది. దీనికి భయపడాల్సిన పని లేదు. ఒక మంచి డాక్టర్ ను కన్సల్ట్ చేయడం మంచిది. అంతేకాదు మీ అండర్ వేర్ కు మచ్చలు పడడం, లేదా మూత్రంలో అవాంఛిత అంశాలు ఏమైనా గమనిస్తే వెంటనే గైనకాలజిస్టును కలవడం ముఖ్యం.