
ఈ టెక్నాలజీ యుగంలో ప్రతి వ్యక్తికి ఎన్నో రోగాలుంటున్నాయి. రోగాలు లేని వ్యక్తులు లేరంటే నమ్మండీ. చిన్నపిల్లల నుంచి మొదలు పెడితే.. ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఎన్నో అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఇక ఈ మధ్య కాలంలో చిన్న వయసు వారు సైతం గుండెకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నారు.
ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి మెయిన్ రీజన్స్ చెడు ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి. ఈ కారణాల వల్లే యువత సైతం గుండె జబ్బుల బారిన పడుతున్నారట. అయితే గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఈ ఐదు కూరగాయలను ప్రతి రోజూ మీ కూరల్లో ఉండాలి. అవేంటంటే..
టొమాటో.. ఇది లేని కూర ఉండదేమో.. ప్రతి వంటలో టొమాటో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది కూడా. పలు అధ్యయనాల ప్రకారం.. మన ఒంట్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడానికి టొమాటోలు ఎంతో సహాయపడతాయట. అంతేకాదు ఇవి బ్లడ్ గడ్డకట్టకుండా రక్షణకల్పిస్తాయి కూడా. ముఖ్యంగా టొమాటోలతో గుండెకు సంబంధించిన ఎలాంటి రోగాలు రావు.
క్యారెట్.. వీటిలో ఫైబర్, కాల్షియం, విటమిన్ బి1, విటమిన్ సి, విటమిన్ బి2, విటమిన్ కె, విటమిన్ బి6, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు బీటా కెరోటిన్, ఆల్ఫా కూడా ఉంటాయి. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. క్యారెట్లను ఎక్కువగా తినే వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ.
తృణధాన్యాలు.. తృణధాన్యాల్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. తృణధాన్యాలైన బుక్వీట్, ఓట్స్, రై, బార్లీ లు మీ గుండెను ఎంతో రక్షిస్తాయి. అంతేకాదు మీ ఒంట్లో ఉండే చెడు కొలెస్ట్రాల్ ను కూడా కరిగించడానికి సహకరిస్తాయి. వీటిని మీ రోజు వారి ఆహారంలో తీసుకోవడం వల్ల హార్ట్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ రావు.
స్ట్రాబెర్రీలు.. బ్లూ బెర్రీలు, స్ట్రాబెర్రీలు, బ్లాక్ బెర్రీస్ లు మన ఆరోగ్యానికి ఎంతో మంచివి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి వాపు, ఆక్సీకరణ, ఒత్తిడిని దూరం చేస్తాయి. అంతేకాదు హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతాయి.
డ్రై ఫ్రూట్స్.. డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదేమో. ఇవి గుండె ఆరోగ్యానికి కూడా ఎంతో సహాయపడతాయి. వాల్ నట్స్, బాదం పప్పులు, కర్జూర పండ్లలో ఉండే రాగి, మెగ్నీషియం, మాంగనీస్, ఫైబర్ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.