Ugadi 2022: ప్రతి ఏడు ఉగాది పండుగ చైత్ర శుక్ల పాడ్యమి నాడు వస్తుంది. మరికొన్ని రోజుల్లో మనమంతా తెలుగు కొత్త సంవత్సరం 'శుభకృతు' నామ సంవత్సరం లోకి అడుగుపెట్టబోతున్నాం. ఇక ఉగాది రోజున అందరి ఇండ్లలో ఉగాది పచ్చడి ఖచ్చితంగా ఉంటుంది. ఈ పండుగ స్పెషల్ యే అది. ఈ పచ్చడి కేవలం ఆనావాయితీగానే చేసుకుంటూ వస్తున్నాం కదా.. మన పండుగలు.. వాటి స్పెషల్స్ వెనుక ఎంతో సైన్స్ దాగుందన్న విషయం మీకు తెలుసా.. అవును పండుగలకు మనం చేసుకుని తినే కొన్ని రకాల ఆహార పదార్థాల్లో ఎన్నోఆరోగ్య రహస్యాలను కలిగి ఉన్నాయి. ఇక ఈ ఉగాది పచ్చడితో మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయన్న ముచ్చట మీకు ఎరుకేనా..
తీపు, కారం, పులుపు, వగరు, పులుపు వంటి ఆరు పదార్థాలతో ఉగాది పచ్చడి రెడీ అవుతుంది కదా. మరి ఈ షడ్రుచుల సమ్మేళనం మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు సంవత్సరం పొడుగునా మన కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలన్నా భావాన్ని కూడా ఇస్తుంది. శాస్త్రీయంగా తయారు చేయబడిన ఈ పచ్చడిని శ్రీరామన నవమి వరకు తాగాలని పండితులు చెబుతున్నారు. ఇక ఉగాది రోజున పరిగడుపున తాగితే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసుకుందాం పదండి..
వేప.. వేప పూత మన ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. రుతువు మారడంతో అనేక వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ముఖ్యంగా అమ్మవారు, మలేరియా, కలరా వంటి వ్యాధులు పిల్లలకు ఎక్కువగా సోకే అవకాశం ఉంది. ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండటానికి వేపపూత దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఎందుకంటే దీనిలో వ్యాధినిరోధక గుణాలున్నాయి. అంతేకాదు ఇందులో యాంటీ వైరస్ లక్షణాలు కూడా ఉంటాయి. అందుకే పండుగలప్పుడు మర్చిపోకుండా గుమ్మాలకు వేపమండలను కడుతుంటారు. గుమ్మాలకు వేపమండలను కట్టడం వల్ల క్రిమికీటకాలు ఇంటిలోపలికి వెళ్లవు.
బెల్లం.. బెల్లం లో ఔషద గుణాలుంటాయి. అందుకే డాక్టర్లు చక్కెరకు బదులుగా బెల్లాన్ని తినాలని చెబుతుంటారు. ఈ బెల్లాన్ని ఆయుర్వేద మందుల తయారీలో కూడా ఉపయోగిస్తుంటారు. కొత్త బెల్లాన్ని తినడం వల్ల ఆకలి బాగా పెరుగుతుంది.
మామిడి ముక్కలు.. మామిడిలో వగరు, పులుపు, తీపి గుణాలు ఉంటాయి. ఈ మామిడి కాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల వ్యాధినిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అంతేకాదు చర్మ సమస్యలను కూడా తగ్గిస్తుంది. చలికాలం పోవడంతో ఎండాకాలంలో కూడా పెదవులు పగులుతుంటాయి. మామిడిలో ఈ సమస్య రాకుండా చేసే గుణముంటుంది.
చింతపండు.. షడ్రుచులో చింతపండు ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ చింతపండు ఎండాకాలం మన ఆరోగ్యానికి మంచి మెడిసిన్ లా పనిచేస్తుంది. అందుకే దీన్ని ఎండాకాలంలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. బరువు తగ్గేందుకు కూడా ఇది ఎంతో సహాయపడుతుంది.
ఉప్పు, కొబ్బరి ముక్కటు.. ఉప్పు రుచికి, ఉత్సాహానికి, భయానికి సంకేతంగా భావిస్తారు. కొబ్బరి ముక్కలు, ఉప్పు శారీరక, మానసిక రుగ్మతలను తొలగిస్తాయి.
కారం.. కారం మన ఆరోగ్యానికి ఎంతో అవసరం. అది కూడా పరిమితిలోనే తీసుకోవాలి. కారం వల్ల మన శరీరంలో ఉండే క్రిమి కీటకాలు నశిస్తాయి.