kiss: లిప్ లాక్ కిస్ వల్ల ఎన్ని నోటి సమస్యలు వస్తాయో తెలిస్తే.. మళ్లోసారి ముద్దు పెట్టుకోరేమో..

Published : May 01, 2022, 11:24 AM IST

kiss: ముద్దు పెట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలున్నాయో.. అంతకంటే ఇంకా ఎక్కువ నష్టాలే ఉన్నాయన్న సంగతి మీలో ఎంత మందికి తెలుసా..?  

PREV
18
kiss: లిప్ లాక్ కిస్ వల్ల ఎన్ని నోటి సమస్యలు వస్తాయో తెలిస్తే.. మళ్లోసారి ముద్దు పెట్టుకోరేమో..

ఒకరిపై ఉన్న ఇష్టాన్ని.. ప్రేమను మాటల్లో చెప్పలేనప్పుడే పార్టనర్స్ ముద్దు రూపంలో  తెలియజేసుకుంటుంటారు. కొంతమంది ముచ్చటగా చెంపపై ముద్దిస్తే.. మరికొందరు మాత్రం లిప్ లాక్ కిస్ తో తమ ప్రేమనంతా ఒలకబోస్తుంటారు.  ముద్దు ఇద్దరి మధ్య బంధాన్ని బలపరచడంతో పాటుగా.. మరింత దగ్గరగా చేస్తుంది. కొన్ని రకాల ముద్దులు ఏకంగా సెక్స్ కు దారితీస్తాయి. ఈ సంగతి పక్కన పెడితే ముచ్చటైన ముద్దు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. 

28

ముద్దు పెట్టుకోవడం వల్ల ఒత్తిడి తగ్గిపోతుంది. ఎక్కువ సేపు ముద్దుపెట్టుకుంటే ఒంట్లో కేలరీలు కూడా బర్న్ అవుతాయి. అంతేకాదు ముద్దు పెట్టుకోవడం వల్ల శరీరంలో కొన్ని రకాల హార్మోన్లు రిలీజ్ అయ్యి చర్మం కాంతివంతంగా తయారవుతుందని పలు పరిశోధనలు స్పష్టం చేశాయి. 

38

ముద్దుతో గుండె పనితీరు కూడా మెరుగుపడుతుంది. దీంతో హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం కూడా తగ్గుతుంది. జంటలు ప్రతిరోజూ ఒక చిరు ముద్దు పెట్టుకోవడం వల్ల వారి మధ్య ప్రేమ మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముద్దుతో ఇద్దరిలో ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుందట. అంతేకాదు ముద్దుతో ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందని పలు నివేధికలు స్పష్టం చేస్తాయి. ముద్దుతో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కానీ ముద్దు పెట్టుకోవడం వల్ల ఎన్నో నోటి వ్యాధులు వస్తాయన్న సంగతి మీకు తెలుసా.. 

48

నోటి పరిశుభ్రత పాటించని వ్యక్తులు లిప్ లాక్ కిస్ పెట్టుకోవడం వల్ల నోటి వ్యాధులు, అంటు వ్యాధులకు కారణమయ్యే బ్యాక్టీరియా ఒకరి నుంచి మరొకరికి సోకవచ్చు. మీకు తెలుసా.. లాలాజల మార్పిడి వల్ల సుమారుగా  80 మిలియన్ల బ్యాక్టీరియా ఒకరి నోటి నుంచి ఇంకొకరి నోటికి బదిలీ అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ కిస్ చేసే వ్యక్తులు సంవత్సరాల తరబడి దంతవైద్య పరీక్షలు చేయించుకోని వారిలో చెడు బ్యాక్టీరియా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. వీరివల్ల చెడు బ్యాక్టీరియా అవతల వ్యక్తికి సంక్రమించే అవకాశం ఎక్కువగా ఉంది. 

58

నోటి సమస్యలు చాలా రకాలు ఉంటాయి. అవన్నీ అంటువ్యాధులు కావు. కానీ బ్యాక్టీరియా లేదా వైరస్ వల్ల వ్యాధి సోకినప్పుడు నోటి వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అవతలి వ్యక్తి దంతాలు ఎన్ని ఎంత తెల్లగా ఉన్నప్పటికీ నోటిలో ఎంతో బ్యాక్టీరియా ఉండొచ్చు. ముద్దు పెట్టుకునే సమయంలో లాలాజల మార్పిడి జరిగిప్పుడు సాధారణంగా మూడు ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. అవేంటంటే..

68

కావిటీస్.. కావిటీస్ సాధారణంగా దంతక్షయం వల్ల వస్తుంది. ఇది Streptococcus mutans అని పిలువబడే ఒక రకమైన బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ఇది అంత తొందరగా బయటపడదు. ఈ రకమైన బ్యాక్టీరియా ఒక ప్రత్యేకమైన ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది దంతాల ఎనామిల్ ను విచ్చిన్నం చేస్తుంది. ఇది కాస్త దంతక్షయానికి దారితీస్తుంది. దీన్ని సకాలంలో తగ్గించుకోకపోతే ఒకటికంటే ఎక్కువ దంతాలు దెబ్బతింటాయి. ఈ రకమైన బ్యాక్టీరియా లాలాజలం ద్వారా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి బదిలీ అవుతుంది. 

78

చిగురువాపు.. చిగురువాపు వ్యాధి వివిధ రకాల బ్యాక్టీరియా వల్ల వస్తుంది. ఈ బ్యాక్టీరియా సోకిన తర్వాత ఆ వ్యక్తి ఏడాదిపొడవునా నోటి సమస్యలతో బాధపడొచ్చు. ఈ బ్యాక్టీరియా ఒక రకమైన విషాన్ని విడుదల చేస్తుంది. అది చిగుళ్ల సున్నితమైన చర్మాన్ని దెబ్బతీస్తుంది. దీంతో చిగుళ్లు చికాకుగా అనిపించడం, మంట పెట్టడం వంటి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాదు బ్రష్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి రక్తస్రావం కూడా అవుతుంది. నోటి దుర్వాసన కూడా రావొచ్చు. 

88

పీరియడోంటల్ వ్యాధి.. Periodontal వ్యాధి  వల్ల చిగుళ్ల కింద భాగంలో చీము ఏర్పడుతుంది. దీనివల్ల చిగుళ్లు మంట పుడుతాయి. అంతేకాదు దీనివల్ల ఎముక కణజాలం కూడా ప్రభావితమవుతుంది. అంతేకాదు ఇది పంటి నష్టాన్ని కూడా కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చివరకు దంతాలను కూడా కోల్పోవచ్చు. అయితే ఈ పెరియోడాంటల్ వ్యాధి పెద్దవారిలో సాధారణంగా కనిపిస్తుంది. ఈ కారణంగానే పెద్దవారు తమ దంతాలను కోల్పోతారు. కానీ ఈ వ్యాధి  అంత తొందరగా నయం కాదు. 

click me!

Recommended Stories