లోపలికి వెళ్ళినా మళ్ళీ రోడ్డే.. అసలు సీక్రెట్ ఏంటి?
ఈ స్టేషన్‌ను సందర్శించే ప్రయాణికులకు ఒక వింత అనుభూతి కలుగుతుంది. పది ఎస్కలేటర్లు దిగి కిందకు వెళ్ళి, తిరిగి బయటకు రావడానికి మళ్ళీ పది ఎస్కలేటర్లు ఎక్కి పైకి వచ్చినా.. వారు ఇంకా రోడ్డు లెవెల్లోనే ఉంటారు.
దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ చోంగ్‌కింగ్ నగరం క్లిష్టమైన భౌగోళిక అమరిక కావడం విశేషం. చోంగ్‌కింగ్ నగరం సమతలమైన భూమిపై కాకుండా, నిటారైన కొండలు, లోయల మధ్య విస్తరించి ఉంటుంది. సాంప్రదాయ మెట్రోల లాగా ఫ్లాట్ రోడ్డు కింద కాకుండా, ఒక భారీ కొండ రాతి పొరలను చీల్చుకుంటూ ఈ స్టేషన్‌ను నిర్మించారు.
ఏటవాలు ప్రదేశం: ఈ కొండ ఉపరితలం తీవ్రమైన ఏటవాలుగా ఉంటుంది. మెట్రో ట్రాక్ కొండ ఒక వైపున 116 మీటర్ల లోతులో ఉంటే, ప్రయాణికులు ఎస్కలేటర్లు ఎక్కి పైకి వచ్చేసరికి ఆ కొండ శిఖరంపై ఉన్న వేరొక రోడ్డు పైకి చేరుకుంటారు. అందుకే ప్రయాణికులు ఎంత లోతుకి వెళ్ళి బయటకు వచ్చినా, భూగర్భంలో కాకుండా కొండపై ఉన్న మరో వీధిలోకి అడుగుపెడతారు.
ప్రపంచాన్ని ఆకర్షిస్తున్న మెట్రో స్టేషన్....
అన్నీ అనుకూలంగా ఉన్న ప్రదేశంలో అన్ని సదుపాయాలతో మెట్రో నిర్మించడం చాలా తేలిక. కానీ, ఇలాంటి క్లిష్టమైన కొండ ప్రాంతాలలో సైతం పాతాళంలోకి మెట్రో మార్గాలను తవ్వి, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెట్రో నిర్మించిన ఘనత చైనా ఇంజినీర్లకే దక్కింది. ఈ మెట్రో స్టేషన్ కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. వాటిని చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. మనమంతా 2026లో ఉంటే.. చైనా మాత్రం 3026లో ఉంది అని కామెంట్స్ చేస్తుండటం విశేషం.