Published : May 02, 2026, 02:21 PM ISTUpdated : May 02, 2026, 02:22 PM IST
Fan: వేసవిలో ఫ్యాన్లకు విశ్రాంతే ఉండదు. రోజంతా తిరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా ఏడాదికో, ఆరునెల్లకో దాన్ని క్లీన్ చేయం. కానీ ఫ్యాన్ వేగంగా తిరిగినా దాని రెక్కలపైన దుమ్ము మాత్రం కిందపడదు. ఎందుకో తెలుసా?
వేసవిలో ఫ్యాన్లు రాత్రి, పగలు తిరుగుతూనే ఉంటుంది. ఎప్పుడో గానీ శుభ్రం చేయం. కొన్నిరోజులకు దాని రెక్కల అంచున నల్లటి దుమ్ము పేరుకుపోవడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే ఫ్యాన్ గాలికి ఇంట్లో ఉన్న దుమ్ము ఎగిరిపోతుంది. కానీ వేగంగా తిరిగే ఫ్యాన్‌పై దుమ్ము ఎలా చేరుతుంది? అసలు తిరిగేటప్పుడు అది కింద ఎందుకు పడిపోదు?
25
స్థిర విద్యుత్ (Static Electricity)
ఫ్యాన్ వేగంగా తిరిగినప్పుడు ఏర్పడే 'స్థిర విద్యుత్' అంటే స్టాటిక్ ఎలక్ట్రిసిటీ వల్ల గాలిలోని దుమ్ము కణాలు రెక్కలకు అయస్కాంతంలా అతుక్కుపోతాయి. అంతేకాకుండా గాలిలోని తేమ ఆ దుమ్మును జిగురుగా మార్చడం వల్ల ఎంత వేగంగా తిరిగినా అది కింద పడకుండా రెక్కలపైనే పేరుకుపోయి అంటుకుపోతుంది.
35
గాలి పొర కారణంగా దుమ్ము కింద పడదు
ఫ్యాన్ ఎంత వేగంగా తిరిగినా, దాని రెక్కలకు దగ్గరగా ఉండే గాలి పొర మాత్రం దుమ్ము కదలకుండా అంటిపెట్టేస్తుంది. అలా చిన్న చిన్న ధూళి కణాలు అక్కడ సులభంగా చేరిపోతాయి. ఈ గాలి పొర కారణంగానే, ఫ్యాన్ వేగానికి దుమ్ము ఎగిరిపోకుండా రెక్కలపైనే అలాగే ఉండిపోతుంది.
గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. ఈ తేమ వల్ల దుమ్ముకు కొద్దిగా జిగురు స్వభావం వస్తుంది. ఇలా జిగురుగా మారిన దుమ్ము ఒక్కసారి రెక్కలపై చేరితే, ఫ్యాన్ వేగంగా తిరిగినా దుమ్ము కిందపడదు. పైగా, దానిపై మరిన్ని దుమ్ము పేరుకుపోతుంది.
55
మీరెప్పుడైనా గమనించారా?
రెక్కలపై దుమ్ము పేరుకుపోయినప్పుడు ఫ్యాన్ బరువెక్కి, గాలి రాదు. అందుకే ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో తిరుగుతున్నా మనకు కావాల్సినంత గాలి రాదు. కాబట్టి ఫ్యాన్‌ను తరచుగా శుభ్రం చేయడం చాలా ముఖ్యం. ఈ వేసవిలో ఫ్యాన్ చాలా ముఖ్యం కాబట్టి…దాని నీట్ నెస్ కూడా కూడా అంతే ముఖ్యం. అప్పుడే మీకు స్వచ్ఛమైన, చల్లని గాలి అందుతుంది. లేకపోతే ఎక్కువ దుమ్ము చేరితే మాత్రం మనం తినేటప్పుడు, కబోర్డులో ఉండే వస్తువులపైనా, బట్టలపైనా దుమ్ము పడుతుంది. మరి మీరెప్పుడైనా గమనించారా?