Garuda Purana: కోట్లల్లో సంపాదించినా.. వీరికి సంతోషం దొరకదు, ఎందుకో తెలుసా?

Published : May 02, 2026, 12:22 PM IST

 Garuda Purana: డబ్బు సంపాదిస్తే.. ఎలాంటి సమస్యలు ఉండవని, సంతోషంగా ఉంటామని చాలా మంది అనుకుంటారు. కానీ, కోట్ల రూపాయలు సంపాదించినా కూడా కొందరు సంతోషంగా ఉండరని గరుడ పురాణం చెబుతోంది.. 

PREV
13
Garuda Purana

గరుడ పురాణం మనం జనన మరణాలు, పునర్జన్మ గురించి వివరిస్తుంది. అంతేకాదు.. మనం చేసే తప్పు ఒప్పులను కూడా ఈ గరుడ పురాణం లెక్కిస్తూ ఉంటుంది. అంతేకాదు.. మన వ్యక్తిత్వం, మనకు ఉన్న మంచి, చెడు గుణాలు మన జీవితంపై చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తూ ఉంటాయి. జీవితంలో విజయం సాధించాలంటే.. చెడు గుణాలు ఉండకూడదు.ఎలాంటి చెడు గుణాలు ఉన్నవారు ఎంత డబ్బు సంపాదించినా కూడా సంతోషంగా ఉండలేరు..? గరుడ పురాణం ఏం చెబుతోంది..?

23
1.మితిమీరిన కోపం....

మితిమీరిన కోపాన్ని అదుపులో ఉంచుకోవాలని గరుడ పురాణం చెబుతుంది. మితిమీరిన కోపం వల్ల జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. అంతేకాదు, కోపం కారణంగా మంచి మంచి అవకాశాలను కూడా కోల్పోతారు. కోపం ఒక వ్యక్తి ఆరోగ్యాన్ని పాడు చేయగలదు. ఆ కోపాన్ని అదుపులో ఉంచుకోవడం నేర్చుకుంటే, వారు జీవితంలో విజయాన్ని సులభంగా చేరుకుంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకోలేని వాళ్లు.. ఎన్ని కోట్లు సంపాదించినా వారికి జీవితంలో సంతోషం, ప్రశాంతత లభించదు.

2.భయం, అభద్రతా భావం..

గరుడ పురాణం ప్రకారం, అభద్రతా భావం ఒక వ్యక్తి అతి పెద్ద బలహీనత. ఒక వ్యక్తి నిరంతరం భయం, అభద్రతా భావంతో ఉంటే తన వ్యక్తి జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోగలడు. అలాంటి వ్యక్తులు తాము చేసే ప్రతి పని గురించి సందేహాలు కలిగి ఉంటారు. ఏ పనినీ సరిగా చేయలేరు.అందుకే.. ఈ రెండు గుణాలు ఉన్నవారు తొందరగా జీవితంలో సక్సెస్ అవ్వలేరు.

33
3.అహంకారం...

అహంకారం ఉన్నవారు జీవితంలో ఎప్పుడూ విజయం సాధించలేరు. అంతేకాదు.. వీరికి ఎంత డబ్బు ఉన్నా కూడా అహంకారం ఉన్న వ్యక్తికి సంతోషం అనేది ఉండదు. ఇలాంటి వారు మిగిలిన వారికంటే తక్కువ ఉన్నారనే భావనలో ఉంటారు. ఇలాంటివారికి ఎవరితోనూ మంచి సంబంధాలు ఉండవు. ఆ అహంకారమే వీరిని కిందకు పడేస్తుంది.

అసంపూర్ణ జ్ఞానం:

గరుడ పురాణం ప్రకారం, అసంపూర్ణ జ్ఞానం అనేది అత్యంత ప్రమాదకరమైనది. ఒక వ్యక్తికి ఏదైనా విషయంపై అసంపూర్ణమైన జ్ఞానం లేదా సమాచారం ఉంటే, తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం ద్వారా వారు ఇబ్బందుల్లో చిక్కుకునే అవకాశం ఉంది. ఈ తప్పుడు నిర్ణయం వారిని జీవితాంతం బాధపడేలా చేయవచ్చు. గరుడ పురాణం ప్రకారం, ఎంత సమయం పట్టినా సరే, ఒక వ్యక్తి సంపూర్ణ జ్ఞానాన్ని తప్పక ఆర్జించాలి. లేకపోతే, అసంపూర్ణ జ్ఞానం జీవితంలో అనేక తీవ్రమైన సమస్యలను సృష్టించవచ్చు.

గరుడ పురాణం ప్రకారం, పైన పేర్కొన్న 4 దుర్గుణాలు ఉన్న ఏ వ్యక్తి కూడా జీవితంలో ఎప్పుడూ సంతోషంగా సుసుంపన్నమైన జీవితాన్ని గడపలేడు. ఈ గుణాలు మార్చుకున్న వారే జీవితంలో మంచి స్థాయికి వెళతారు.

Read more Photos on
click me!

Recommended Stories