నేత్రవతి నది: కర్ణాటకలోని పశ్చిమ కనుమల్లో జన్మించే పవిత్ర నేత్రవతి నదీ తీర ప్రాంతాల్లో , ధర్మస్థల సమీపంలో ప్రవహించే నీటి ప్రవాహంలో ఇలాంటి సహజ శివలింగ ఆకారాలు కనిపిస్తాయి. ఈ నదికి ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టత ఉంది.
నర్మదా , శివనాథ్ నదులు: మధ్యప్రదేశ్ , ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ప్రవహించే నర్మదా, శివనాథ్ నదీ పరివాహక ప్రాంతాలు బాణలింగాలకు ప్రపంచ ప్రసిద్ధి. ఇక్కడి నదీ గర్భం నుంచి తీసే ప్రతి రాయి శివస్వరూపమేనని భక్తుల నమ్ముతారు.
సాధారణంగా ఆలయాల్లో ప్రతిష్ఠించే శివలింగాలను శిల్పులు రాతిని చెక్కి తయారుచేస్తారు. కానీ ఈ పవిత్ర నదుల్లో లభించే బాణలింగాలకు ఎటువంటి ప్రాణప్రతిష్ఠ లేదా చెక్కడం అవసరం లేదని, ఇవి స్వయంభూ శక్తులతో కూడుకుని ఉంటాయని వేద పండితులు చెప్తారు. ఈ రాళ్లపై సహజంగానే ఓం ఆకారం, త్రిశూలం లేదా విభూతి రేఖలను పోలిన చారలు ఏర్పడటం మరో విశేషం.. వీటిని ఇళ్లలో, దేవాలయాలలో ప్రతిష్ఠించుకుని పూజించడం వల్ల అత్యంత శుభఫలితాలు కలుగుతాయని విశ్వసిస్తారు.