మన వంటలలో వెల్లుల్లికి ఎంతో ప్రాధాన్యం ఉంది. సాంబార్, చట్నీ, కూరలు, గ్రేవీల రుచిని పెంచేందుకు దీన్ని బాగా వాడతారు. అయితే మన దేశంలో ఒక నగరాన్ని 'గార్లిక్ సిటీ'గా పిలుస్తారు. దీనివల్ల ఆ నగరానికే ప్రత్యేక గుర్తింపు వచ్చింది.
మధ్యప్రదేశ్‌లోని మందసౌర్ ప్రాంతాన్ని 'గార్లిక్ సిటీ ఆఫ్ ఇండియా' అని పిలుస్తారు. ఇక్కడ వెల్లుల్లి కేవలం ఒక పంట మాత్రమే కాదు, అక్కడి రైతుల ఆదాయంలో, ఆ జిల్లా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తుంది.
మందసౌర్‌కు ఆ పేరు ఎందుకొచ్చింది?
మధ్యప్రదేశ్‌లో వెల్లుల్లి పండించే ముఖ్యమైన ప్రాంతాల్లో మందసౌర్ ఒకటి. ఇక్కడ రైతులు వెల్లుల్లిని భారీ స్థాయిలో పండించడమే కాకుండా, పెద్ద ఎత్తున వ్యాపారం కూడా చేస్తారు. విశేషం ఏంటంటే, మందసౌర్ 'వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్' (ODOP) కింద వెల్లుల్లిని గుర్తించారు. అందుకే ఈ పంట అక్కడి రైతులకు ప్రధాన ఆదాయ వనరుగా మారింది.