దీనికి స్వామీజీ బదులిస్తూ.. ఈ గ్రామంలో కూడా అలాంటి మంచి వ్యక్తులే ఉన్నారని చెప్తాడు. ఇది విన్న ఆ బాటసారి గ్రామంలోకి వెళ్తాడు. ఇదంతా అక్కడే ఉండి గమనిస్తున్న ఓ శిష్యుడు స్వామిజీ వద్దకు వెళ్లి.. 'అదేంటి స్వామీ.. ఇద్దరికి వేరు వేరు సమాధానం ఇచ్చారు'? అని ప్రశ్నిస్తాడు. దీంతో అసలు విషయం చెబుతూ.. 'సమాజాన్ని మనం ఎలా చూస్తామో, మనల్ని కూడా సమాజం అలాగే చూస్తుంది. నువ్వు మంచిని కోరుకుంటే సమాజం నుంచి కూడా నీకు మంచి జరుగుతుంది. అందుకే నోరు మంచిదైదే ఊరు మంచిది అవుతుంది' అని సమాధానం ఇస్తాడు.
నీతి: ఈ చిన్న కథలో ఎంతో గొప్ప సందేశం దాగి ఉంది. మనం సమాజాన్ని ఎలా చూస్తామన్న దానిపైనే సమాజం మనల్ని ఎలా చూస్తుందో అర్థమవుతుంది. మనచుట్టూ రకరకాల మనుషులు ఉంటారు. కానీ మనం మంచిగా ఉంటే మనకు అంతా మంచే కనిపిస్తుంది.