Motivational story: పక్కవారు ఏమనుకుంటున్నారో అని బాధపడుతున్నారా.? ఈ గాడిద కథ చదివితే మారాల్సిందే

Published : Feb 10, 2025, 10:39 AM ISTUpdated : Feb 11, 2025, 08:40 AM IST

మనలో చాలా మంది పక్కవారు ఏమనుకుంటున్నారో అనే ఆలోచనలో ఉంటారు. నిత్యం అదే టెన్షన్‌లో ఉంటారు. అయితే ఈ గాడిద కథ చదివితే మీ ఆలోచన మారడం ఖాయం. ఇంతకీ ఆ కథ ఏంటంటే..   

PREV
13
Motivational story: పక్కవారు ఏమనుకుంటున్నారో అని బాధపడుతున్నారా.? ఈ గాడిద కథ చదివితే మారాల్సిందే

'మనకోసం కాదు నలుగురి' కోసం బతకాలని చాలా మంది చెబుతుంటారు. అయితే ఇందులో కొంత వరకు నిజం ఉన్నా. నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారని బాధపడితే జీవితంలో ముందుకు వెళ్లలేము. పక్కవారు ఏదో అనుకుంటారని బాధపడుతుంటే మన జీవితం సాఫీగా సాగదు. మీరు కూడా ఇలాగే ఆ నలుగురి గురించి బాధపడుతేంటే ఓసారి ఈ గాడిద కథ చదవండి, మీ ఆలోచనలో ఇట్టే మార్పు వస్తుంది. 
 

23

ఒక రోజు ఇద్దరు భార్యాభర్తలు గాడిదపై కూర్చొని వేరే గ్రామానికి వెళ్తుంటారు. అలా వెళ్తున్న సమయంలో అక్కడున్న ఓ నలుగురు మాట్లాడుతూ.. 'చూశారా వారికి అసలు బుద్ది ఉందా.? కనీసం మానవత్వం అనేది కూడా లేకుండా. గాడిదపై కూర్చొని ఎలా వెళ్తున్నారు.? ఆ గాడిద ఇద్దరి బరువును ఎలా మోస్తుందనే ఆలోచన కూడా లేదా? కనీసం ఒక్కరైనా నడిచే వెళ్తే ఏమవుతుంది అంటారు. 

దీంతో ఇది విన్న భర్త తాను కిందికి దిగి భార్యను గాడిదపై కూర్చొబెట్టి వెళ్తుంటాడు. మరో ప్రాంతానికి వెళ్లే సరికి అక్కడున్న వారు మాట్లాడుతూ.. 'ఇదేం విడ్డూరం, భార్యను దర్జాగా గాడిదపై కూర్చొబెట్టి భర్త ఎలా నడుస్తున్నాడు. భార్య అంటే అతనికి ఎంత భయమో' అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. 
 

33

ఇది విన్న ఆ భర్త.. భార్యను నడిపిస్తూ తాను గాడిదపై కూర్చుంటాడు. కాసేపు ప్రయాణం సాగిన తర్వాత మరో గ్రామంలో ఉన్న కొందరు. భర్తను తిట్టడం మొదలు పెడతారు. 'మగవాడై ఉండి. తాను నడవకుండా మహిళను నడిపిస్తున్నాడు. అసలు అతను మనిషేనా' అంటారు. దీంతో.. అసలు ఈ గొడవ అంతా ఎందుకు. ఇద్దరం నడుచుకుంటూ వెళ్తే సరిపోతుంది కదా అని గాడిదను నడిపించుకుంటూ వెళ్తుంటారు. 

మరో గ్రామానికి వెళ్లే సరికి అక్కడున్న వారు చూసి 'వీళ్లకు అసలు బుద్ధి ఉందా.? గాడిద ఉండగా అలా నడుచుకుంటూ వెళ్తున్నారు ఏంటి.? ఉన్న వస్తువును ఎలా ఉపయోగించుకోవాలో కూడా తెలియని మూర్ఖులు వీళ్లు అంటూ' తిడుతుంటారు. 

నీతి: ఈ చిన్న కథలో జీవితానికి సరిపడ సందేశం దాగి ఉంది. మనం ఏది చేసినా నాలుగు మాటలు అనే ఆ నలుగురు కచ్చితంగా ఉండే ఉంటారు. అందుకే నలుగురి మాటలు పట్టించుకోకుండా మీకు నచ్చింది చేయాలి. అయితే ఎదుటి వ్యక్తికి నష్టం కలగకుండా, నీజాయితీగా ముందుకు వెళ్తే ఎవరేం అనుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. 

click me!

Recommended Stories